Share News

Richest People: ఒక్కరోజులోనే రూ.82 వేల కోట్లు సంపాదించిన 23 మంది వ్యాపారవేత్తలు

ABN , Publish Date - Aug 17 , 2024 | 12:24 PM

భారత స్టాక్ మార్కెట్లు (stock markets) శుక్రవారం రికార్డు స్థాయి లాభాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలపై పెట్టుబడులు చేసిన మదుపర్లకు ఒక్కరోజే 7.5 లక్షల కోట్ల ఆదాయం లభించింది. ఇక ఆయా కంపెనీల షేర్లను కల్గి ఉన్న ఓనర్ల మరింత సంపద మరింత పెరిగి అపర కుబేరులుగా మారిపోయారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Richest People: ఒక్కరోజులోనే రూ.82 వేల కోట్లు సంపాదించిన 23 మంది వ్యాపారవేత్తలు
23 Indian businessmen richest

భారత స్టాక్ మార్కెట్లు (stock markets) శుక్రవారం రికార్డు స్థాయి లాభాల్లో ముగిశాయి. దీంతో దేశంలోని పలు కంపెనీల షేర్లు మరింత పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలపై పెట్టుబడులు చేసిన మదుపర్లకు ఒక్కరోజే 7.5 లక్షల కోట్ల ఆదాయం లభించింది. ఇక ఆయా కంపెనీల షేర్లను కల్గి ఉన్న ఓనర్ల మరింత సంపద మరింత పెరిగి అపర కుబేరులుగా మారిపోయారు. వారిలో దేశంలోని 25 మంది బిలియనీర్లలో 23 మంది నికర విలువలో 9.84 బిలియన్ డాలర్లు అంటే రూ.8,25,33,73,80,000 కోట్లకు పైగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా అందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.


భారతీయ బిలియనీర్లలో ప్రధానంగా గౌతమ్ అదానీ నికర విలువలో అత్యధిక పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత ముఖేష్ అంబానీ సంపద పెరిగింది. వీరిద్దరి నికర విలువలో ఏకంగా 3.22 బిలియన్ డాలర్లు అంటే 27 వేల కోట్ల రూపాయలకు పైగా పుంజుకుంది. ఇది మొత్తం పెరుగుదలలో మూడో వంతు కావడం విశేషం.

ఏ బిలియనీర్ సంపద ఎంత పెరిగింది?

  • ముఖేష్ అంబానీ సంపద $1.37 బిలియన్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర విలువ $111 బిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో అంబానీ 11వ స్థానంలో ఉన్నారు.

  • గౌతమ్ అదానీ సంపదలో 1.85 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఆ తర్వాత ఆయన మొత్తం నికర విలువ 104 బిలియన్ డాలర్లుగా మారింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో అదానీ 14వ స్థానంలో ఉన్నారు.


  • షాపూర్ మిస్త్రీ నికర విలువ $978 మిలియన్లు పెరిగింది. ఆ తర్వాత ఆయన మొత్తం నికర విలువ $41.6 బిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో షాపూర్ 36వ స్థానంలో కలరు.

  • శివ నాడార్ నికర విలువలో 828 మిలియన్ డాలర్ల పెరుగుదల కనిపించింది. తర్వాత మొత్తం నికర విలువ 38.5 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో 39వ స్థానంలో ఉన్నారు.


  • సావిత్రి జిందాల్ నికర విలువ 524 మిలియన్ డాలర్లు పెరుగగా, ఆమె మొత్తం నికర విలువ 32.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో 50వ స్థానంలో ఉన్నారు.

  • అజీమ్ ప్రేమ్‌జీ నికర విలువ 906 మిలియన్ డాలర్లు పెరిగింది. ఆ తర్వాత మొత్తం నికర విలువ 28.7 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో 61వ స్థానంలో కలరు.

  • దిలీప్ షాంఘ్వీ నికర విలువ 79.1 మిలియన్ డాలర్లు పెరుగగా, మొత్తం నికర విలువ 28.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో 63వ స్థానంలో ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

Multibagger Stock: రూ.1,113 నుంచి రూ.10,310కి చేరిన షేర్ ప్రైస్.. ఐదేళ్లలోనే మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి..


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 17 , 2024 | 12:28 PM