Share News

5 లక్షల కోట్ల డాలర్లు

ABN , Publish Date - May 22 , 2024 | 05:41 AM

స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో సరికొత్త రికార్డు స్థాయి 5 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకింది. బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌...

5 లక్షల కోట్ల డాలర్లు

సరికొత్త మైలురాయికి స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో సరికొత్త రికార్డు స్థాయి 5 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకింది. బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌ ఈ మైలురాయిని చేరడం ఇదే తొలిసారి. చివర్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలతో పాటు మార్కెట్‌ సంపద కూడా కాస్త తగ్గి 4.97 లక్షల కోట్ల డాలర్ల (రూ.414.62 లక్షల కోట్లు)కు పరిమితమైంది. మార్కెట్‌ సంపద పరంగా అమెరికా, చైనా, జపాన్‌, హాంకాంగ్‌ తర్వాత భారత్‌ ఐదో స్థానంలో ఉంది. మరిన్ని విషయాలు..

  • గత ఏడాది నవంబరు 29న బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌ తొలిసారిగా 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని చేరింది.

  • 2021 మే 24న 3 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని దాటగా.. 2017 జూలై 10న 2 లక్షల కోట్ల డాలర్లకు, 2007 మే 28న లక్ష కోట్ల డాలర్ల మార్క్‌కు చేరుకుంది.

  • మార్కెట్‌ సంపద 2014 జూన్‌ 6న 1.5 లక్షల కోట్ల డాలర్లకు, 2020 డిసెంబరు 16న 2.5 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.

  • లక్ష కోట్ల డాలర్ల నుంచి 1.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకునేందుకు 2,566 రోజులు లేదా 7 ఏళ్లకు పైగా సమయం పట్టింది. 1.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 2 లక్షల కోట్ల డాలర్లకు పెరిగేందుకు 1,130 రోజులు పట్టింది. అంటే, లక్ష కోట్ల డాలర్ల నుంచి 2 లక్షల కోట్ల డాలర్లకు చేరుకునేందుకు 10 ఏళ్లు పట్టిందన్నమాట.

  • 1,255 రోజుల్లో మార్కెట్‌ సంపద 2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 2.5 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకింది.

  • ఞఈ ఏడాదిలో ఇప్పటివరకు బీఎ్‌సఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ 1,713.05 పాయింట్లు (2.37 శాతం) పుంజుకుంది. ఈ ఏప్రిల్‌ 9న సూచీ ఆల్‌టైం రికార్డు గరిష్ఠ స్థాయి 75,124.28 వద్దకు చేరుకుంది.


మిశ్రమంగా ముగిసిన సూచీలు

లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామా ణిక ఈక్విటీ సూచీలు చివరికి మిశ్రమంగా ముగిశాయి. మంగళవారం ఇంట్రాడేలో 426 పాయింట్ల శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్‌.. ట్రేడింగ్‌ నిలిచేసరికి, 52.63 పాయింట్ల నష్టంతో 73,953.31 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మాత్రం 27.05 పాయింట్ల లాభంతో 22,529.05 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 14 లాభపడగా.. మిగతా 16 నష్టపోయాయి. టాటా స్టీల్‌ షేరు 3.81 శాతం వృద్ధితో సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సైతం 3.68 శాతం పుంజుకుంది. నెస్లే, మారుతి సుజుకీ షేర్లు మాత్రం ఒక శాతానికి పైగా క్షీణించాయి.బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఇంట్రాడేలో సరికొత్త జీవనకాల గరిష్ఠాలను తాకినప్పటికీ, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.34 శాతం లాభంతో సరిపెట్టుకోగా.. స్మాల్‌క్యాప్‌ సూచీ 0.18 శాతం తగ్గింది.


మార్కెట్‌ సంపద పరంగా

టాప్‌-10 కంపెనీలు

ర్యాంక్‌ కంపెనీ రూ.లక్షల కోట్లు

1 రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 19.43

2 టీసీఎస్‌ 13.83

3 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 11.08

4 ఐసీఐసీఐ బ్యాంక్‌ 7.88

5 భారతీ ఎయిర్‌టెల్‌ 7.62

6 ఎస్‌బీఐ 7.41

7 ఎల్‌ఐసీ 6.47

8 ఇన్ఫోసిస్‌ 5.95

9 ఐటీసీ 5.43

10 హిందుస్థాన్‌ యూనిలీవర్‌ 5.42

Updated Date - May 22 , 2024 | 05:41 AM