Share News

లాభాల స్వీకరణకు చాన్స్‌ !

ABN , Publish Date - Jul 01 , 2024 | 05:25 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశం ఉంది. సూచీలు ఇప్పటికే గరిష్ఠ స్థాయిలకు చేరరటంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగే అవకాశం ఉంది...

లాభాల స్వీకరణకు చాన్స్‌ !

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశం ఉంది. సూచీలు ఇప్పటికే గరిష్ఠ స్థాయిలకు చేరరటంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగే అవకాశం ఉంది. శుక్రవారం నాటి సెషన్లో ఇదే కనిపించింది. అయితే బడ్జెట్‌లో కేంద్రం మౌలిక రంగం, పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలకు మద్దతుగా నిర్ణయాలు తీసుకోవచ్చని భావిస్తే మాత్రం మార్కెట్‌ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

స్టాక్‌ రికమండేషన్స్‌

ఇండస్‌ టవర్‌: నిఫ్టీతో పోలిస్తే ఈ షేరు మెరుగ్గా ట్రేడవుతోంది. రూ.360 వద్ద గరిష్ఠ స్థాయిని చేరిన తర్వాత సైడ్‌వేస్‌ కన్సాలిడేషన్‌ జరిగింది. తక్కువ వాల్యూమ్‌ నమో దు కావటాన్ని బట్టి చూస్తే డిమాండ్‌ ఎక్కువగా ఉందని అర్ధం చేసుకోవచ్చు. గత శుక్రవారం ఈ షేరు 2.75 శాతం లాభంతో రూ.375 వద్ద క్లోజైంది. ట్రేడర్లు ఈ కౌంటర్‌లో రూ.360/370 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.425 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.349 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


జేకే టైర్‌: పెరిగిన రబ్బరు ధరల భారాన్ని వినియోగదారులకు బదలాయిస్తామని కంపెనీ చెప్పటంతో ఈ షేరులో ఒక్కసారిగా కదలిక ఏర్పడింది. రానున్న రోజుల్లో మార్జిన్స్‌ పెరిగే అవకావం ఉండటంతో ఇన్వెస్టర్ల చూపు ఈ షేరుపై పడింది. ఈ షేరు జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత 26 శాతం మేర క్షీణించింది. తాజాగా ఈ షేరుకు రూ.400 స్థాయిల్లో మంచి బేస్‌ ఏర్పడింది. గత శుక్రవారం ఈ షేరు 9.13 శాతం లాభంతో 429.75 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.428 స్థాయిల్లో ప్రవేశించి రూ.442/448 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.425 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎస్‌బీఐ లైఫ్‌: గత వారం ఈ షేరు వారం, నెల గరిష్ఠాలను బ్రేక్‌ చేసింది. జూన్‌ ఆరంభం నుంచి అప్‌ట్రెండ్‌ను కనబరుస్తూ వస్తోంది. గత శుక్రవారం 1.95 శాతం లాభంతో రూ.1,491 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లోకి మదుపరులు రూ.1,460/1,480 స్థాయిల్లో ప్రవేశించి రూ.1,545/1,595 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,445 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


హీరో మోటోకార్ప్‌: జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ షేరులో స్వల్ప పుల్‌బ్యాక్‌ వచ్చింది. చివరి వారం వాల్యూమ్‌ తగ్గటమే కాకుండా ప్రైస్‌ యాక్షన్‌ చాలా టైట్‌గా జరుగుతోంది. నిఫ్టీతో పోల్చితే బలంగా ట్రేడవుతుండటం, గరిష్ఠ స్థాయిలను తాకే కొద్దీ పుల్‌బ్యాక్‌ స్వల్పంగా ఉండటం దీని ప్రత్యేకత. కిత్రం సెషన్‌లో ఈ షేరు 1.91 శాతం లాభంతో రూ.5,590 వద్ద ముగిసింది. మదుపరులు ఈ కౌంటర్‌లోకి రూ.5,550/5,560 స్థాయిల్లో ఎంటరై రూ.5,760 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.5,510 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఐఐఎ్‌ఫఎల్‌: ఈ షేరు విభజన అనంతరం ఈ కౌంటర్‌లో వాల్యూమ్‌ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం అప్‌ట్రెండ్‌ దిశగా సాగుతోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ మాత్రం కాస్త బలహీనంగా ఉంది. అయితే చివరి మూడు సెషన్లలో 13 శాతం లాభపడటం సానుకూల అంశం. గత శుక్రవారం ఈ షేరు 7.8 శాతం లాభంతో రూ.517.30 వద్ద క్లోజైంది.


మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.510 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.555/590 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.485 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

Updated Date - Jul 01 , 2024 | 05:25 AM