Paytm: డేంజర్ జోన్‌లో పేటీఎం షేర్..ఇంకా తగ్గనుందా?
ABN , Publish Date - May 23 , 2024 | 06:10 PM
ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ పేటిఎం మాతృ సంస్థ అయిన One 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు క్రమంగా మళ్లీ తగ్గుతున్నాయి. ప్రస్తుతం(మే 23న) ఈ షేర్ ధర రూ.358 ఉండగా, పలు బ్రోకరేజ్ సంస్థలు మాత్రం ఈ కంపెనీ షేర్ టార్గెట్ ధరను తగ్గించాయి. ఈ నేపథ్యంలో పేటీఎం షేర్ ప్రైస్ ఎంతకు చేరనుందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.
ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ పేటిఎం(paytm) మాతృ సంస్థ అయిన One 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు క్రమంగా మళ్లీ తగ్గుతున్నాయి. ప్రస్తుతం(మే 23న) ఈ షేర్ ధర రూ.358 ఉండగా, పలు బ్రోకరేజ్ సంస్థలు మాత్రం ఈ కంపెనీ షేర్ టార్గెట్ ధరను తగ్గించాయి. ఈ క్రమంలో దాదాపు 25 శాతం తగ్గి రూ.275కి చేరుతుందని చెబుతున్నాయి. మార్చి త్రైమాసిక ఫలితాల తర్వాత ఈ కంపెనీ షేర్లు గురువారం 4.1% క్షీణించి ఇంట్రాడేలో రూ.353.55 కనిష్ట స్థాయికి చేరాయి.
అక్రమాస్తుల నేపథ్యంలో తన కార్యకలాపాలను మూసివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) Paytm పేమెంట్స్ బ్యాంక్ (PPBL)ని ఆదేశించిన జనవరి 31 నుంచి Paytm షేర్లు దెబ్బతిన్నాయి. ఆ క్రమంలో ఈ షేరు జనవరి 31న రూ.761 వద్ద నుంచి దాదాపు 54 శాతం పడిపోయింది. అయితే 52 వారాల గరిష్ట స్థాయి నుంచి ఇది ఏకంగా 65 పడిపోయింది. మరోవైపు ఈ షేరు ఐపీఓ ధర రూ.2,140 నుంచి 84 శాతం క్షీణించడం విశేషం.
FY 2023-24 నాలుగో త్రైమాసికంలో ఫిన్‌టెక్ కంపెనీ One97 కమ్యూనికేషన్స్ నష్టం రూ.550 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే కాలంలో నష్టం రూ.167.5 కోట్లుగా ఉంది. One97 కమ్యూనికేషన్స్ Paytm బ్రాండ్‌ను కలిగి ఉంది. UPI లావాదేవీలపై తాత్కాలిక అంతరాయం, PPBL నిషేధం కారణంగా మా Q4 FY 2023-24 ఫలితాలు ప్రభావితమయ్యాయని Paytm ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి:
Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.
Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్
Read Latest Business News and Telugu News