Share News

CMRF: వరద ప్రభావిత ప్రాంతాలకు కార్పొరేట్ సంస్థల దన్ను.. మేమున్నాం అంటూ

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:07 PM

వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు కార్పొరేట్‌ సంస్థలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నాయి.

CMRF: వరద ప్రభావిత ప్రాంతాలకు కార్పొరేట్ సంస్థల దన్ను.. మేమున్నాం అంటూ

హైదరాబాద్: వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు కార్పొరేట్‌ సంస్థలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే భారత్‌ బయోటెక్‌ సంస్థ రెండు రాష్ట్రాల సీఎం ఫ్లడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి చొప్పున విరాళం ప్రకటించింది. వరదలతో దెబ్బతిన్న ప్రజల పునరావాసం, ఉపశమనానికి సాయపడడం బాధ్యతగా భావించి ఈ విరాళం అందిస్తున్నట్టు తెలిపింది.


తెలంగాణ వరద సహాయ చర్యల కోసం రూ.2.5 కోట్లు

తెలంగాణ వరద బాధితుల సహాయ, పునరావాసం కోసం జీఎం ఆర్‌ గ్రూప్‌ రూ.2.5 కోట్ల విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును జీఎంఆర్‌ గ్రూప్‌ ప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అందజేశారు. ఇప్పటికే సినీ రంగానికి చెందిన హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తదితర నటులు తెలుగు రాష్ట్రాలకు సాయాన్ని ప్రకటించారు. ఇదే బాటలో ఇంకొదరు నడుస్తున్నారు. ఎన్నడూ లేనంతగా ఇటీవల కాలంలో కురిసిన వర్షాలు తెలంగాణ, ఏపీని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.

For Latest News click here

Updated Date - Sep 07 , 2024 | 12:07 PM