Home » Vijayawada Floods
దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం ఉదయం ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా దేవాలయ ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.
భారీ వర్షాలు, వరద బాధితులకు అందించే సాయంపై ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి ఆర్థిక ప్యాకేజీని ప్రభుత్వం అందజేయనుంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని చాలా జిల్లాలు చిగురుటాకులా వణికిన విషయం తెలిసిందే. వరదల ధాటికి చాలా మంది నిరాశ్రయులయ్యారు.
విజయవాడ వరద ప్రాంతాల్లో జీఎంసీ సిబ్బంది 12 రోజులు సేవలు అందించారని గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాస్ కొనియాడారు. రోజు లక్ష మందికి ఆహారం, తాగునీరు, పాలు అందజేశారని వివరించారు.
Andhrapradesh: నగరంలోని కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్టు కాలనీలో మంత్రి నారాయణ సుడి గాలి పర్యటన చేశారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై స్వయంగా బైక్ నడుపుకుంటూ మంత్రి పర్యటించారు. నిన్నటి వరకు వరద నీరు ఉన్న ప్రాంతాల్లో శరవేగంగా వందలాది పారిశుధ్య కార్మికులతో క్లీనింగ్ పనులు జరుగుతున్నాయి.
భారీ వర్షాలతో విజయవాడ నగరానికి వరద నీరు పోటెత్తింది. నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. వరద నష్టంపై ఉన్నతాధికారులతో చంద్రబాబు కేబినెట్లోని పలువురు మంత్రులు సమావేశమయ్యారు. అందుకు సంబంధించిన ఓ ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. వ్యతిరేక ప్రచారానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. ఈ ప్రచారంపై ఐటీడీపీ తనదైన శైలీలో స్పందించింది. ఈ సందర్బంగా వైసీపీకి ఐటీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది.
విజయవాడ నగరానికి భారీగా వరద నీరు పోటెత్తడం వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అందులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఉన్నాయి. వారిని ఆదుకొనేందుకు మరోసారి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ముందుకు వచ్చారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ క్రమంలో టీడీపీ శ్రేణులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారీ బుద్దా వెంకన్న.
Andhrapradesh: వరద ప్రాంతాలలో సర్వీస్ అందించిన అగ్నిమాపక సిబ్బందిని పైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పైర్ డీజీ మాట్లాడుతూ.. బుడమేరు ప్రవాహంలో 32 వార్డులు పది రోజుల పాటు ఉన్నాయన్నారు. ఇంతటి విపత్తు రావడం తమకు తెలిసి ఇదే తొలిసారన్నారు.
వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, సినీనటులు, రాజకీయ నాయకులు గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలసి విరాళాల చెక్కులు అందజేశారు.
రికార్డు స్థాయి భారీ వర్షాలు, వరదలు విజయవాడను అతలాకుతలం చేశాయని కేంద్ర బృందం అభిప్రాయపడింది.