Share News

AP Rains: వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చిన ఐటీడీపీ

ABN , Publish Date - Sep 13 , 2024 | 04:57 PM

భారీ వర్షాలతో విజయవాడ నగరానికి వరద నీరు పోటెత్తింది. నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. వరద నష్టంపై ఉన్నతాధికారులతో చంద్రబాబు కేబినెట్‌లోని పలువురు మంత్రులు సమావేశమయ్యారు. అందుకు సంబంధించిన ఓ ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. వ్యతిరేక ప్రచారానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. ఈ ప్రచారంపై ఐటీడీపీ తనదైన శైలీలో స్పందించింది. ఈ సందర్బంగా వైసీపీకి ఐటీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది.

AP Rains: వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చిన ఐటీడీపీ
YSRCP vs TDP

అమరావతి, సెప్టెంబర్ 13: ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రా ఓటరు కూటమికి పట్టం కట్టాడు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష హోదా సైతం దక్కించుకో లేని వైసీపీ ఓ విధమైన ఫేక్ ప్రచారానికి తెర తీసింది. దీంతో ఐటీడీపీ రంగంలోకి దిగి.. ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చింది.

Also Read: YS Jagan: బాలినేని శ్రీనివాసరెడ్డితో విడదల రజినీ చర్చలు


ఇంతకీ ఏం జరిగిందంటే.. ఎడ తెరిపి లేకుండా భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరానికి వరద నీరు పోటెత్తింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో వరద నష్టం తాలుక అంచనాలపై మంత్రి వర్గ ఉప సంఘం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు పొంగూరు నారాయాణ, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడుతోపాటు రెవెన్యు శాఖ ఉన్నతాధికారులు సైతం హాజరయ్యారు.

Also Read: Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. ఆప్ నేతల్లో వెల్లివిరిసిన ఆనందం


ఈ సందర్బంగా ప్రాణ, పంట, ఆస్తి, జంతు నష్టంపై అందిన నివేదికలపై ఈ సమావేశంలో చర్చించారు. అందుకు సంబంధించిన అంశాలను రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. ఆ క్రమంలో ఆయన కాలుపై కాలు వేసుకుని కూర్చున్నారు.

Also Read: Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నాటి ఈడీ సమన్లు నుంచి నేటి బెయిల్ వరకు..


అందుకు సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ప్రభుత్వంలో మంత్రుల పరిస్థితి ఇది అంటూ వైసీపీ సొంత వక్రభాష్యం చెబుతూ.. ఓ విధమైన ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దీనిపై ఐటీడీపీ తనదైన శైలిలో స్పందిస్తూ.. వైసీపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. అందులోభాగంగా ఐఏఎస్‌లు అయ్యా ఎస్ అనకుండా దర్జాగా కూర్చో గలుగుతున్నారంటూ వ్యాఖ్యానించింది.


అంతేకాకుండా.. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్.. ప్రజాప్రతినిధులను గేటు బయట నిలబెట్టిన ఫొటోతోపాటు సీఎం వైఎస్ జగన్ కుర్చి వద్ద మోకాళ్లపై ఐఏఎస్ సీనియర్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతున్న ఫొటోను సైతం కౌంటర్‌గా ఐటీడీపీ ట్వీట్ చేసింది.

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 13 , 2024 | 06:10 PM