Share News

Credit Cards: 15 శాతం వృద్ధి దిశగా క్రెడిట్ కార్డుల పరిశ్రమ.. 20 కోట్లకు చేరుతుందని అంచనా

ABN , Publish Date - Sep 04 , 2024 | 12:16 PM

భారత్‌లో క్రెడిట్ కార్డుల(Credit Cards) సంఖ్య 200 మిలియన్లకు(20 కోట్లు) చేరుతుందని తాజాగా పీడబ్ల్యూసీ నివేదిక అంచనా వేసింది. మొత్తంగా వీటిల్లో15 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR) నమోదవుతుందని వెల్లడించింది.

Credit Cards: 15 శాతం వృద్ధి దిశగా క్రెడిట్ కార్డుల పరిశ్రమ.. 20 కోట్లకు చేరుతుందని అంచనా

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో క్రెడిట్ కార్డుల(Credit Cards) సంఖ్య 200 మిలియన్లకు(20 కోట్లు) చేరుతుందని తాజాగా పీడబ్ల్యూసీ నివేదిక అంచనా వేసింది. మొత్తంగా వీటిల్లో15 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR) నమోదవుతుందని వెల్లడించింది. క్రెడిట్ కార్డ్ పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని, గత ఐదేళ్లలో జారీ చేసిన క్రెడిట్ కార్డుల సంఖ్య రెట్టింపు అయిందని PwC తెలిపింది. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగుతుందని అంచనా వేసింది. "భారత్‌లో FY28-29 నాటికి క్రెడిట్ కార్డ్ మార్కెట్ 200 మిలియన్ కార్డ్‌లకు చేరుకుంటుందని మేం అంచనా వేస్తున్నాం. గత ఐదేళ్లలో ఈ పరిశ్రమ100 శాతం వృద్ధి సాధించింది.

రాబోయే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే వృద్ధిని నమోదు చేస్తుంది" అని నివేదిక పేర్కొంది. క్రెడిట్ కార్డ్ పరిశ్రమ లావాదేవీల్లో గణనీయమైన పెరుగుదలను రిపోర్ట్ వివరించింది. లావాదేవీల విలువ మొత్తంగా 28 శాతం పెరిగింది. నూతన ఉత్పత్తులు, వినూత్న ఆఫర్లు, కస్టమర్ల పెరుగుదల వృద్ధికి కారణాలుగా చెప్పవచ్చు.


తగ్గుతున్న డెబిట్ కార్డుల వినియోగం..

అయితే డెబిట్ కార్డుల వినియోగం తగ్గిందని నివేదిక పేర్కొంది. డెబిట్ కార్డ్ లావాదేవీల సంఖ్య, విలువ రెండూ తగ్గాయి. ఇది వినియోగదారుల ప్రాధాన్యతలలో మార్పును సూచిస్తోంది. FY23-24 ఏడాదిలో డెబిట్ కార్డ్ లావాదేవీల వాల్యూమ్‌ మునుపటి సంవత్సరంతో పోలిస్తే 33 శాతం తగ్గింది. డెబిట్ కార్డ్‌లపై ఏడాదికి18 శాతంమేర ఖర్చు తగ్గింది. ఒకే ఏడాదిలో డెబిట్ కార్డులు గణనీయంగా తగ్గాయి. FY 23-24 సమయంలో డెబిట్ లావాదేవీల పరిమాణం, విలువ గణనీయంగా దెబ్బతిన్నాయి.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌కు(UPI) పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా డెబిట్ కార్డుల వాడకం తగ్గింది. వినియోగదారులు చాలా వరకు యూపీఐ చెల్లింపులనే ఆశ్రయిస్తున్నారు. జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) కారణంగా చిన్న, మధ్యస్థ వ్యాపారులకు యూపీఐ ప్రధాన చెల్లింపు సాధనంగా మారింది. ఆకర్షణీయమైన రివార్డులు ఇవ్వకపోవడంతో.. డెబిట్ కార్డ్‌లు క్రెడిట్ కార్డ్‌లతో పోటీపడలేకపోతున్నాయి. రివార్డులు ఇవ్వకపోవడం, డెబిట్ కార్డు ప్రయోజనాలపై అవగాహన తక్కువగా ఉండటం వల్ల ఈ కార్డ్‌లు వినియోగదారులను ఆకర్షించట్లేదు.


వృద్ధిపథంలో డిజిటల్ చెల్లింపులు..

భారత్‌లో డిజిటల్ చెల్లింపులు వృద్ధిపథంలో సాగుతున్నాయి. FY23-24లో లావాదేవీల పరిమాణం సంవత్సరానికి 42 శాతం పెరిగింది. ఈ ట్రెండ్ FY28-29 నాటికి మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. సాంకేతిక పురోగతి, వినియోగదారులకు అవగాహన పెరగడం వంటి కారణాలతో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయని నివేదిక వెల్లడించింది.

For Latest News click here

Updated Date - Sep 04 , 2024 | 12:16 PM