Share News

Budget 2024: కస్టమ్ డ్యూటీ తగ్గింపు.. తగ్గనున్న మొబైల్ ఫోన్స్, బంగారం, ప్లాటినం ధరలు

ABN , Publish Date - Jul 23 , 2024 | 04:13 PM

బడ్జెట్ 2024(budget 2024) నేపథ్యంలో మధ్యతరగతి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అంది ఏంటంటే బంగారం(gold), వెండి(siver), ప్లాటినం, మొబైల్స్(mobile phones), సహా పలు వస్తువులపై కస్టమ్ డ్యూటీని మోదీ ప్రభుత్వం భారీగా తగ్గించింది. దీంతో ఆయా వస్తువుల ధరలు క్రమంగా తగ్గనున్నాయి.

Budget 2024: కస్టమ్ డ్యూటీ తగ్గింపు.. తగ్గనున్న మొబైల్ ఫోన్స్, బంగారం, ప్లాటినం ధరలు
Custom duty reduction

బడ్జెట్ 2024(budget 2024) నేపథ్యంలో మధ్యతరగతి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అంది ఏంటంటే బంగారం(gold), వెండి(siver), ప్లాటినం, మొబైల్స్(mobile phones), సహా పలు వస్తువులపై కస్టమ్ డ్యూటీని మోదీ ప్రభుత్వం భారీగా తగ్గించింది. దీంతో ఆయా వస్తువుల ధరలు క్రమంగా తగ్గనున్నాయి. ఈ క్రమంలో బంగారం, వెండిపై ప్రాథమిక కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇది కాకుండా 25 ముఖ్యమైన ఖనిజాలపై కస్టమ్ డ్యూటీలో మినహాయింపును ప్రకటించారు.


ప్లాటినం సహా

ప్లాటినం(platinum), పల్లాడియం, ఓస్మియం, రుథేనియం, ఇరిడియంలపై సుంకాన్ని 15.4 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. ఎగుమతులు, తయారీని పెంచేందుకు విలువైన లోహాలపై సుంకాన్ని తగ్గించాలని రత్నాలు, ఆభరణాల ఎగుమతిదారులు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. దేశీయ తయారీకి మద్దతు ఇవ్వడంతోపాటు ఎగుమతి పోటీతత్వాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సాధారణ ప్రజానీకం, వినియోగదారుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ పన్నులను సరళీకృతం చేసినట్లు చెప్పారు.


మరింత చౌకగా ఫోన్లు

దీంతోపాటు మొబైల్(mobile phones), ఉపకరణాలు, ఛార్జర్‌లపై సుంకం 15%కి తగ్గించారు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్‌లు, ఛార్జర్‌ల వంటి ఉపకరణాలు మరింత చౌకగా మారతాయి. దీంతో దేశంలోని యాపిల్, ఫాక్స్‌కాన్, శాంసంగ్ వంటి మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది. కస్టమ్ డ్యూటీ తగ్గింపు ఈ కంపెనీలకు ఉపశమనం కలిగిస్తుంది. దీంతోపాటు ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కూడా సృష్టించబడతాయి. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అత్యధిక మొబైల్ మార్కెట్‌గా ఉంది. ఇక్కడ ఉత్పత్తి సంవత్సరానికి 16% వృద్ధి చెంది గత సంవత్సరం 44 బిలియన్ డాలర్లకు చేరుకుంది.


ఇవి కూడా చదవండి:

Budget 2024: కార్మికులకు అద్దె గృహాల స్కీం.. మరో 3 కోట్ల కొత్త ఇళ్లు

Budget 2024: వేతన జీవులకు శుభవార్త.. కొత్త పన్ను స్లాబ్స్ ప్రకటన

Gold and Silver Rates: బడ్జెట్ వేళ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు


Union Budget 2024: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 10 లక్షల వరకు లోన్స్


Budget 2024: బడ్జెట్ 2024లో ముద్ర లోన్స్ రుణ పరిమితి రూ.20 లక్షలకు పెంపు

Budget 2024-25: బడ్జెట్ 2024-25ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్


Read More Business News and Latest Telugu News

Updated Date - Jul 23 , 2024 | 04:15 PM