Share News

Piyush Goyal: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. భారీగా డీఏ, డీఆర్ పెంపు

ABN , Publish Date - Mar 07 , 2024 | 08:59 PM

ఏళ్లుగా ఎదురుచూస్తున్న డీఏ పెంపునకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) గురువారం కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌(డీఏ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్‌(డీఆర్)ను ఈ ఏడాది జనవరి 1 నుంచి నాలుగు శాతం పెంచినట్లు పీయూష్ ప్రకటించారు.

Piyush Goyal: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. భారీగా డీఏ, డీఆర్ పెంపు

ఢిల్లీ: ఏళ్లుగా ఎదురుచూస్తున్న డీఏ పెంపునకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) గురువారం కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌(DA), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్‌(DR)ను ఈ ఏడాది జనవరి 1 నుంచి నాలుగు శాతం పెంచినట్లు పీయూష్ ప్రకటించారు. ఈ పెంపుతో ప్రస్తుతం 46 శాతంగా ఉన్న డీఏ బేసిక్ పేలో 50 శాతానికి చేరుతుంది. చివరి డీఏ పెంపు 2023అక్టోబర్‌లో చేశారు. అప్పుడు 4 శాతం పెంపుతో 46 శాతానికి డీఏ పెరిగింది. డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ కారణంగా కేంద్ర ఖజానాపై ఏటా రూ.12,869 కోట్ల అదనపు భారం పడనుంది.

దీని ప్రభావం 2024-25 ఏడాదిలో (జనవరి 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు) రూ. 15,014 కోట్లుగా ఉంటుంది. డీఏ పెంపుతో పాటు రవాణా, క్యాంటీన్, డిప్యుటేషన్ అలవెన్స్‌లను 25 శాతానికి పెంచారు. ఇంటి అద్దె అలవెన్స్‌ను బేసిక్ పేలో 27 శాతం, 19 శాతం, 9 శాతం నుంచి వరుసగా 30 శాతానికి, 20 శాతానికి, 10 శాతానికి పెంచారు. గ్రాట్యుటీ కింద ప్రయోజనాలు ప్రస్తుతం ఉన్న రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. వివిధ అలవెన్సుల పెంపు వల్ల ఖజానాపై ఏటా రూ.9,400 కోట్ల భారం పడనుంది. ఈ పెరుగుదల 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సులపై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 09:06 PM