ఆల్వోటెక్‌తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
ABN , Publish Date - May 22 , 2024 | 02:31 AM
ప్రముఖ బయోసిమిలర్స్ తయారీ కంపెనీ ఆల్వోటెక్‌తో, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఆల్వోటెక్ అభివృద్ది చేసి...
హైదరాబాద్: ప్రముఖ బయోసిమిలర్స్ తయారీ కంపెనీ ఆల్వోటెక్‌తో, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఆల్వోటెక్ అభివృద్ది చేసి, తయారు చేసే ‘ఏవీటీ03’ అనే బయోసిమిలర్ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తన నెట్‌వర్క్ ద్వారా వాణిజ్య స్థాయిలో అమెరికా, యూరప్, బ్రిటన్ దేశాల్లో మార్కెట్ చేస్తుంది. డెనోసుమాబ్ అనే ఈ బయోసిమిలర్ ఔషధాన్ని ఎము కలు గుల్లబారటం వంటి సమస్యల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు.