Share News

EPFO: ఈపీఎఫ్‌వో సభ్యులకు గుడ్‌న్యూస్

ABN , Publish Date - Jul 12 , 2024 | 09:18 PM

ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన అవుట్‌గోయింగ్ సభ్యులకు వడ్డీ చెల్లింపులను విడుదల చేయడం ఈపీఎఫ్‌వో (EPFO) ప్రారంభించింది. ఈ ఏడాది వడ్డీ రేటును 8.25 శాతంగా సంస్థ నిర్ణయించబడింది

EPFO: ఈపీఎఫ్‌వో సభ్యులకు గుడ్‌న్యూస్
EPFO

ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన అవుట్‌గోయింగ్ సభ్యులకు వడ్డీ చెల్లింపులను విడుదల చేయడం ఈపీఎఫ్‌వో (EPFO) ప్రారంభించింది. ఈ ఏడాది వడ్డీ రేటును 8.25 శాతంగా సంస్థ నిర్ణయించబడింది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటివరకు ​​23.04 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు, క్లెయిమ్‌లు అన్నింటికీ కలిపి మొత్తం రూ.9,260 కోట్లను చెల్లించినట్టు ఈపీఎఫ్‌వో పేర్కొంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ వేదికకగా ఈపీఎఫ్‌వో పంచుకుంది.


కాగా ఆర్థిక సంవత్సరం 2023-24కి వడ్డీ రేటును 8.25 శాతం నిర్ణయించినట్టు ఫిబ్రవరి 10, 2024న ఈపీఎఫ్‌వో ప్రకటించింది. కాగా అంతకుముందు ఏడాది 2022-23 వడ్డీ రేటు 8.15 శాతం, 2021-22కి 8.10 శాతంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. కాగా వడ్డీ రేటుని ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయిస్తుంది.

Updated Date - Jul 12 , 2024 | 09:19 PM