Share News

EPFO: మే నెలలో 19.50 లక్షల కొత్త ఉద్యోగాలు.. ఈపీఎఫ్‌ఓ నివేదిక

ABN , Publish Date - Jul 21 , 2024 | 08:11 AM

దేశవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఒక్క మే నెలలోనే 19.50 లక్షల ఉద్యోగకల్పన జరిగిందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) తెలిపింది. మే నెలలో 19.50 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓ చందాదారులుగా చేరారని వెల్లడించింది. శనివారం ఇందుకు సంబంధించిన డేటాను విడుదల చేసింది.

EPFO: మే నెలలో 19.50 లక్షల కొత్త ఉద్యోగాలు.. ఈపీఎఫ్‌ఓ నివేదిక

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఒక్క మే నెలలోనే 19.50 లక్షల ఉద్యోగకల్పన జరిగిందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) తెలిపింది. మే నెలలో 19.50 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓ చందాదారులుగా చేరారని వెల్లడించింది.

శనివారం ఇందుకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. మే 2023తో పోలిస్తే, మే 2024లో 19.62 శాతం మంది ఎక్కువగా ఈపీఎఫ్‌ఓ చందాదారులుగా మారారని వెల్లడించింది. ఉద్యోగావకాశాలు, ఉద్యోగుల అవకాశాలపై అవగాహన పెరగడం, ఇతర కార్యక్రమాల వల్ల సభ్యుల చేరిక పెరిగిందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.


2024 మే లో EPFOలో 9.85 లక్షల మంది కొత్త సభ్యులు చేరారు. మునుపటి నెల ఏప్రిల్‌తో పోలిస్తే నమోదిత శాతం 10.96 పెరిగింది. అయితే కొత్త ఉద్యోగులలో కొందరు ఇది వరకే ఈపీఎఫ్‌ఓలో సభ్యులుగా ఉండి ఒక కంపెనీ నుంచి మరో సంస్థకు మారిన వారు కూడా ఉన్నారు. అధికారికంగా పే రోల్‌ (ఉద్యోగాల) డేటా విడుదల చేస్తున్న 2018 ఏప్రిల్‌ తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాలు లభించడం ఇదే తొలిసారి అని మంత్రిత్వ శాఖ తెలిపింది.


2023లో వృద్ధి ఎంతంటే..

2023 ఏప్రిల్‌తో పోలిస్తే 11.5 శాతం వృద్ధి నమోదైంది. వీరిలో 18-25 ఏళ్లలోపు వారే 58.37 శాతంగా ఉన్నారు. పే రోల్‌ డేటా ప్రచురించడం మొదలయ్యాక ఆ వయసు వారికి ఈ స్థాయిలో ఉద్యోగాలు లభించడం కూడా ఇప్పుడే. గతంలో 14.09 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్‌ఓ నుంచి బయటకి వచ్చి, మళ్లీ మేలో చేరారు. 2023 మేతో పోలిస్తే ఇలా చేరిన వారి సంఖ్య 23.47 శాతం పెరిగింది.


శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం కూడా ఉంది. కొత్తగా చేరిన వారిలో మహిళలే 2.48 లక్షల మంది ఉన్నారు. 2023 మేతో పోలిస్తే వీరి సంఖ్య 12.15 శాతం పెరిగింది. రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హరియాణాల నుంచి అత్యధికంగా ఈపీఎఫ్‌ఓలో సభ్యులుగా చేరారు. ఈ 5 రాష్ట్రాల వాటాయే 58.24 శాతంగా ఉంది. ఒక్క మహారాష్ట్ర వాటానే 18.87 శాతంగా ఉండటం విశేషం.

For Latest News and National News click here

Updated Date - Jul 21 , 2024 | 08:11 AM