Gold and Silver Prices: పుత్తడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ తగ్గిందోచ్
ABN , Publish Date - Apr 26 , 2024 | 06:42 AM
ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు దేశంలో బంగారం(gold) ధర దాదాపు 200 రూపాయలు తగ్గింది. ఈ క్రమంలో ఉదయం 6 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.74680 ఉండగా, ప్రస్తుతం అది రూ.74410కి చేరుకుంది.
ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు దేశంలో బంగారం(gold) ధర దాదాపు 200 రూపాయలు తగ్గింది. ఈ క్రమంలో ఉదయం 6 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.74680 ఉండగా, ప్రస్తుతం అది రూ.74410కి చేరుకుంది. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు నిన్న రూ.68,460 ఉండగా, ప్రస్తుతం రూ.68,210కి చేరింది. అయితే మరికొన్ని రోజుల్లో అక్షయ తృతీయ వస్తున్న నేపథ్యంలో బంగారం రేటు తగ్గినప్పుడే కొనుగోలు చేయండి. లేదంటే మరికొన్ని రోజుల్లో గోల్డ్ రేట్లు పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు దేశంలో ఈరోజు వెండి(silver) ధరల విషయానికి వస్తే స్పల్ప మార్పు జరిగింది. నేడు కిలో వెండి ధర రూ.85,400కు చేరింది. కాగా నిన్న ఈ ధర కిలో రూ.85,500. వెండి ధరలు నేడు 100 రూపాయలు మాత్రమే తగ్గాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.85,900 ఉండగా, ఇది నిన్న 86 వేలుగా ఉండేది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ. 83600 ఉండగా, ఢిల్లీలో రూ.82400, ముంబైలో రూ.82400, చెన్నైలో రూ.85,900గా ఉంది.
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది. అంతేకాదు GST, TCS, ఇతర ఛార్జీలు వీటిలో కలిగి ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక ఆభరణాల వ్యాపారిని సంప్రదించండి.
ఇది కూడా చదవండి:
Bank Holidays: మేలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్
Shyam Pitroda: సంపన్నులు చనిపోతే వారి సంపద తీసుకునే చట్టం రూపొందించాలి
Read Latest Business News and Telugu News