Share News

పసిడి పడుతోంది..

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:22 AM

పసిడి, వెండి ధరలు వరుసగా మూడో రోజూ తగ్గుముఖం పట్టాయి.ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర గురువారం మరో రూ.1,000 తగ్గి రూ.70,650 స్థాయికి జారుకుంది. కిలో వెండి ఏకంగా రూ.3,500 తగ్గడంతో...

పసిడి పడుతోంది..

న్యూఢిల్లీ: పసిడి, వెండి ధరలు వరుసగా మూడో రోజూ తగ్గుముఖం పట్టాయి.ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర గురువారం మరో రూ.1,000 తగ్గి రూ.70,650 స్థాయికి జారుకుంది. కిలో వెండి ఏకంగా రూ.3,500 తగ్గడంతో ధర రూ.84,000కు దిగివచ్చింది. అంతర్జాతీయంగా వీటి ధరలు గణనీయంగా తగ్గడంతోపాటు దేశీయ బులియన్‌ మార్కెట్లోనూ జువెలర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. గడిచిన మూడు రోజుల్లో తులం బంగారం రూ.5,000 తగ్గింది. ఈ విలువైన లోహాలపై కస్టమ్స్‌ సుంకాన్ని 6 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించడంతో ఈనెల 23న గోల్డ్‌ రేటు ఏకంగా రూ.3,350 పడిపోయి రూ.72,300 స్థాయికి జారుకుంది. ఈ ఏడాదిలో అదే అతిపెద్ద తగ్గుదల. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర ఒక దశలో 42.20 డాలర్లు తగ్గి 2,421 డాలర్ల స్థాయిలో ట్రేడవగా.. సిల్వర్‌ 28 డాలర్ల స్థాయికి పడిపోయింది.

Updated Date - Jul 26 , 2024 | 04:22 AM