Share News

వచ్చేసింది గూగుల్‌ వ్యాలెట్‌

ABN , Publish Date - May 09 , 2024 | 05:31 AM

టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు గూగుల్‌ వ్యాలెట్‌ యాప్‌ను బుధవారం విడుదల చేసింది. యూజర్లు ఈ యాప్‌లో తమ బోర్డింగ్‌ పాస్‌లు, లాయల్టీ కార్డులు, ఈవెంట్‌ టికెట్లు, ప్రజారవాణా పాస్‌ల...

వచ్చేసింది గూగుల్‌ వ్యాలెట్‌

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు గూగుల్‌ వ్యాలెట్‌ యాప్‌ను బుధవారం విడుదల చేసింది. యూజర్లు ఈ యాప్‌లో తమ బోర్డింగ్‌ పాస్‌లు, లాయల్టీ కార్డులు, ఈవెంట్‌ టికెట్లు, ప్రజారవాణా పాస్‌ల వంటివి భద్రంగా దాచుకోవచ్చు. బుధవారం నుంచే ఈ డిజిటల్‌ వ్యాలెట్‌ పని చేయడం ప్రారంభించింది. గూగుల్‌ పే యాప్‌నకు ఇది కాంప్లిమెంటరీగా అందుబాటులోకి వచ్చింది. ‘‘గూగుల్‌ పే యాప్‌ ఎక్కడికీ పోదు. అది ఎప్పటికీ మా ప్రాథమిక పేమెంట్‌ యాప్‌గా కొనసాగుతుంది. నాన్‌ పేమెంట్‌ కేసుల్లో గూగుల్‌ వ్యాలెట్‌ ఉపయోగరకంగా ఉంటుంది’’ అని గూగుల్‌ ఆండ్రాయిడ్‌ జీఎం, ఇండియా ఇంజనీరింగ్‌ లీడ్‌ రామ్‌ పాపట్ల చెప్పారు. ఈ కొత్త సర్వీస్‌ కోసం ఎయిరిండియా, ఇండిగో, ఫ్లిప్‌కార్ట్‌, పైన్‌ లాబ్స్‌, కోచి మెట్రో, పీవీఆర్‌, ఐనాక్స్‌ వంటి 20 భారతీయ బ్రాండ్లతో గూగుల్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఈ వ్యాలెట్‌ పూర్తిగా సురక్షితమని, కస్టమర్ల గోప్యతను కాపాడుతుందని రామ్‌ చెప్పారు.

Updated Date - May 09 , 2024 | 05:31 AM