Share News

జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:11 AM

సెప్టెంబరు నెలకు గాను వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 6.5 శాతం వృద్ధి చెంది రూ.1.73 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది...

జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు

సెప్టెంబరు ఆదాయంలో 6.5% వృద్ధి

న్యూఢిల్లీ: సెప్టెంబరు నెలకు గాను వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 6.5 శాతం వృద్ధి చెంది రూ.1.73 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. 2023 సెప్టెంబరులో జీఎ్‌సటీ స్థూల వసూళ్లు రూ.1.63 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా, ఈ ఆగస్టులో ఆదాయం రూ.1.75 కోట్లుగా నమోదైంది. గత నెలకు రిఫండ్ల సర్దుబాటు అనంతరం నికర జీఎ్‌సటీ ఆదాయం రూ.1.53 లక్షల కోట్లుగా ఉంది. 2023 సెప్టెంబరులో నమోదైన నికర జీఎ్‌సటీ ఆదాయంతో పోలిస్తే 3.9 శాతం పెరిగింది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, గత నెలలో తెలంగాణ జీఎ్‌సటీ ఆదాయం ఒక శాతం వార్షిక పెరుగుదలతో రూ.5,267 కోట్లుగా, ఆంధ్రప్రదేశ్‌ జీఎ్‌సటీ రెవెన్యూ 4 శాతం తగ్గుదలతో రూ.3,506 కోట్లుగా నమోదైంది.


2025 ఏప్రిల్‌ 1 నుంచి జీఎ్‌సటీ యాంటీ ప్రాఫిటీరింగ్‌ దర్యాప్తులకు స్వస్తి

వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) నుంచి పన్ను అధికారులు జీఎ్‌సటీ చట్టంలో భాగంగా యాంటీ ప్రాఫిటీరింగ్‌కు సంబంధించి కొత్త దర్యాప్తులేవీ చేపట్టబోరు. ఎందుకంటే, జీఎ్‌సటీ చట్టంలోని యాంటీ ప్రాఫిటీరింగ్‌ క్లాజ్‌కు కటాఫ్‌ తేదీని 2025 ఏప్రిల్‌ 1గా ప్రకటించింది ప్రభుత్వం. మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.

Updated Date - Oct 02 , 2024 | 01:11 AM