Share News

హీరో మోటోకార్ప్‌ ఆదాయం రూ.9,616 కోట్లు

ABN , Publish Date - May 09 , 2024 | 05:33 AM

హీరో మోటోకార్ప్‌ నాలుగో త్రైమాసికానికి రూ.943.46 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాదిలో ఇదే కాలానికి గడించిన రూ.810.8 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 16.7 శాతం అధికం...

హీరో మోటోకార్ప్‌ ఆదాయం రూ.9,616 కోట్లు

  • తుది డివిడెండ్‌ రూ.40

న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్‌ నాలుగో త్రైమాసికానికి రూ.943.46 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాదిలో ఇదే కాలానికి గడించిన రూ.810.8 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 16.7 శాతం అధికం. కాగా, కంపెనీ ఏకీకృత ఆదాయం రూ.8,434.28 కోట్ల స్థాయి నుంచి రూ.9,616.68 కోట్లకు పెరిగింది. మొత్తం ఖర్చులు సైతం రూ.7,508.94 కోట్ల నుంచి రూ.8,427.36 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి 13.92 లక్షల మోటార్‌ సైకిళ్లు, స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.37,788.62 కోట్ల ఆదాయంపై రూ.3,742.16 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2023-24కు గాను వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.40 తుది డివిడెండ్‌ చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే చెల్లించిన రూ.100 తాత్కాలిక, ప్రత్యేక డివిడెండ్‌తో కలిపితే, గత ఆర్థిక సంవత్సరానికి చెల్లించే మొత్తం డివిడెండ్‌ రూ.140 అవుతుంది.

Updated Date - May 09 , 2024 | 05:33 AM