Business Idea: రూ. 5 వేలతో పెట్టుబడి.. నెలకు 2 లక్షలకుపైగా ఆదాయం!
ABN , Publish Date - Aug 11 , 2024 | 01:34 PM
ప్రస్తుత కాలంలో ప్రతి ఫ్యామిలీకి బైక్(bike) తప్పనిసరిగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లాలన్నా కూడా ద్విచక్రవాహనం(two wheeler) లేకుండా వెళ్లలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆటోమోటివ్ పరిశ్రమలో మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆసక్తి ఉంటే సెకండ్ హ్యాండ్ టూ వీలర్ వ్యాపారాన్ని(business) ప్రారంభించడం బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, ఎంత లాభం వచ్చే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
స్తుత కాలంలో ప్రతి ఫ్యామిలీకి బైక్(bike) తప్పనిసరిగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లాలన్నా కూడా ద్విచక్రవాహనం(two wheeler) లేకుండా వెళ్లలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆటోమోటివ్ పరిశ్రమలో మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆసక్తి ఉంటే సెకండ్ హ్యాండ్ టూ వీలర్ వ్యాపారాన్ని(business) ప్రారంభించడం బెస్ట్ అని చెప్పవచ్చు. ఇటివల కాలంలో ఉపయోగించిన మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేయడం, అమ్మకాలు చేయడం కూడా భారీగా పెరిగింది. అయితే ఇవి కొత్త వాటితో పోల్చితే దాదాపు సగం ధరకు లభిస్తున్న క్రమంలో అనేక మంది వీటివైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ వ్యాపారం ప్రారంభించాలంటే మీకు బైక్‌లను రిపేర్ చేయడం వంటి పరిజ్ఞానం ఉంటే మీకు మరింత లాభం ఉంటుంది. ఈ వ్యాపారాన్ని మార్కెటింగ్ చేయడం ద్వారా లాభాలను మరింత పెంచుకోవచ్చు.
వేగంగా అభివృద్ధి
భారతదేశంలో సెకండ్ హ్యాండ్ బైక్ వ్యాపారం(second hand bikes business) ప్రతి ఏటా పుంజుకుంటుంది. ప్రస్తుతం మీడియం రేంజ్ బైక్ ధర రూ.50 నుంచి 60 వేల నుంచి మొదలవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా సెకండ్ హ్యాండ్ బైక్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ వ్యాపారానికి ఉన్న డిమాండ్ చూసి బడా కంపెనీలు కూడా ఈ రంగంలోకి వస్తున్నాయి. భారత్‌లో ద్విచక్ర వాహనాల విక్రయాల్లో జపాన్‌కు చెందిన హోండా మొదటి స్థానంలో ఉంది. ఘజియాబాద్‌లో తన మొదటి సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్‌ను ప్రారంభించడం ద్వారా ఈ రంగంలోకి ప్రవేశించింది.
ఎంత లాభం
మీరు ఈ వ్యాపారాన్ని పెద్ద నగరం లేదా చిన్న పట్టణంలో(small city) కూడా ప్రారంభించవచ్చు. సెకండ్ హ్యాండ్ బైక్‌లకు ప్రతిచోటా డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం చిన్న పట్టణాలు, గ్రామాలలో కూడా దీని డిమాండ్ పెరుగుతోంది. 5 నుంచి 10 వేల రూపాయలతో దీన్ని ప్రారంభించవచ్చు. మీకు ఎక్కువ స్థలం, డబ్బు లేకపోతే, మొదట్లో ఓ సెకండ్ హ్యాండ్ బైక్ కొని అమ్మండి. బైక్ అమ్మిన తర్వాత మీరు మరొక బైక్‌ను కొనుగోలు చేయకుండా ఆ బైక్ తీసుకున్న వ్యక్తితో బైక్ అమ్మిన తర్వాత డబ్బులు చెల్లిస్తానని ఒప్పందం చేసుకోవచ్చు.
రెండు విధాలుగా
ఆ విధంగా మీరు బైక్‌లను ఒక్కొక్కటిగా తీసుకుని మీరు అమ్మాలనుకున్న చిన్న స్థలంలో వాటిని పెట్టుకుని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఉదాహరణకు మీరు నెలకు 20 బెక్స్ అమ్మినా కూడా ఒక్కో దానిపై రూ.10 వేల లాభం వేసుకుంటే రెండు లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఇంకా ఎక్కువ బైక్స్ అమ్మితే లాభం ఎక్కువ వస్తుంది. ఆ క్రమంలో మీరు బైక్ అమ్మిన వ్యక్తి, కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి కమిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీని మార్కెటింగ్ కోసం మీరు సోషల్ మీడియా లేదా ఇతర వెబ్ సైట్ల సహాయం కూడా తీసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News