Share News

Layoffs: మరో అగ్రసంస్థలో ఉద్యోగుల తొలగింపులు.. హైదరాబాద్‌, బెంగళూరులో కూడా..?

ABN , Publish Date - Jul 31 , 2024 | 05:51 PM

గత కొన్ని నెలలుగా ఉద్యోగుల(jobs) తొలగింపు ప్రక్రియ(layoffs) కొనసాగుతూనే ఉంది. అయితే ఈ జాబితాలో చిన్న కంపెనీలతోపాటు అగ్ర సంస్థలు కూడా ఉండటం విశేషం. ఇదివరకు మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు లేఆఫ్స్ ప్రకటించగా, తాజాగా అమెరికన్ చిప్ తయారీ అగ్ర సంస్థ ఇంటెల్(Intel) కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది.

Layoffs: మరో అగ్రసంస్థలో ఉద్యోగుల తొలగింపులు.. హైదరాబాద్‌, బెంగళూరులో కూడా..?
Intel layoffs

గత కొన్ని నెలలుగా ఉద్యోగుల(jobs) తొలగింపు ప్రక్రియ(layoffs) కొనసాగుతూనే ఉంది. అయితే ఈ జాబితాలో చిన్న కంపెనీలతోపాటు అగ్ర సంస్థలు కూడా ఉండటం విశేషం. ఇదివరకు మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు లేఆఫ్స్ ప్రకటించగా, తాజాగా అమెరికన్ చిప్ తయారీ అగ్ర సంస్థ ఇంటెల్(Intel) కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. క్షీణిస్తున్న మార్కెట్ వాటా నుంచి కొలుకునే చర్యల్లో భాగంగానే వేలాది మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. అయితే ఈ నివేదికపై ఇంటెల్ స్పందించడానికి నిరాకరించింది.


మళ్లీ ఉద్యోగాల కోత

ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ తమ సంస్థ పోటీతత్వాన్ని తిరిగి పొందడం, తయారీ ఖర్చులను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఈ క్రమంలో అధునాతన చిప్ టెక్నాలజీలో పెట్టుబడి పెట్టడం, కొత్త మార్కెట్‌లలోకి విస్తరించడంపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. అక్టోబరు 2022లో రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం 2023లో వార్షిక వ్యయాలను 3 బిలియన్ డాలర్లకు తగ్గించే లక్ష్యంతో ప్రణాళికను ప్రకటించింది.

ఆ క్రమంలో చిప్‌మేకర్ సంస్థ ఒక సంవత్సరం క్రితం 2023 చివరి నాటికి 131,900 ఉద్యోగుల నుంచి 124,800కి తగ్గించింది. ఈ ప్లాన్ 2025 నాటికి 8 నుంచి 10 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని కంపెనీ గత ఏడాది ఫిబ్రవరిలో తెలిపింది. డేటా ప్రకారం రెండో త్రైమాసిక ఆదాయం ఒక సంవత్సరం క్రితం మాదిరిగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ ఉద్యోగాల కోత(layoffs) తప్పదని నివేదికలు చెబుతున్నాయి.


హైదరాబాద్‌, బెంగళూరు

ఈ క్రమంలో భారత్‌తోపాటు(india) అనేక చోట్ల ఇంటెల్ ఉద్యోగాలను తగ్గించే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇంటెల్ బెంగుళూరు(bangalore), హైదరాబాద్‌(hyderabad)లలో అత్యాధునిక సౌకర్యాలతో అమెరికా వెలుపల అతిపెద్ద డిజైన్, ఇంజనీరింగ్ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ కేంద్రాలలో 13,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు ప్రపంచవ్యాప్తంగా ఇంటెల్ ఉత్పత్తులకు సహకరిస్తున్నారు. అయితే వీరిలో ఎంత మందిని తొలగించే అవకాశం ఉందనేది మాత్రం తెలియలేదు. ఇక ఉద్యోగుల తొలగింపు చేస్తారనే విషయం తెలిసిన టెక్ వర్గాలు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు తమ జాబ్ ఉడుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.


కారణమిదేనా..

ఇంటెల్ ఆర్థికంగా కోలుకోవడం, తగ్గిపోతున్న మార్కెట్ వాటాను పరిష్కరించే ప్రయత్నాల్లో భాగంగా వేలాది ఉద్యోగాలను(jobs) తగ్గించడానికి సిద్ధంగా ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది. అయినప్పటికీ కంపెనీ షేర్లు 1 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటికే 40 శాతం షేర్లు పడిపోయిన ఇంటెల్‌కి ఇది చిన్న ఉపశమనమని చెప్పవచ్చు. నివేదిక ప్రకారం ఇంటెల్ ఇంకా అధికారికంగా తొలగింపులను ప్రకటించలేదు. అయితే ఈ వారంలోనే ప్రకటన రావచ్చని అంటున్నారు. AI అప్లికేషన్‌లలో ఉపయోగించే చిప్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌తో ఇంటెల్ సంస్థ కష్టాలను ఎదుర్కొంటోంది.


ఇవి కూడా చదవండి:

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..


ITR Filling: ఐటీఆర్ దాఖలుకు నేడే లాస్ట్ ఛాన్స్.. గడువు పెంచుతారా, క్లారిటీ


Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే


Read More Business News and Latest Telugu News

Updated Date - Jul 31 , 2024 | 05:56 PM