Share News

ITR: ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ గడువు పొడిగించారా.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..

ABN , Publish Date - Jul 25 , 2024 | 10:31 AM

మీరు ఆదాయపు పన్ను చెల్లింపుదారులా.. ఇంకా ఆదాయపన్ను చెల్లించలేదా.. గడువుంది కదా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ వార్త కచ్చితంగా మీకోసమే. ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆగష్టు 31వరకు గడువు పొడిగించారంటూ సామాజిక మాద్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది.

ITR: ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ గడువు పొడిగించారా.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..
ITR

మీరు ఆదాయపు పన్ను చెల్లింపుదారులా.. ఇంకా ఆదాయపన్ను చెల్లించలేదా.. గడువుంది కదా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ వార్త కచ్చితంగా మీకోసమే. ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆగష్టు 31వరకు గడువు పొడిగించారంటూ సామాజిక మాద్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. దీంతో మరో నెలకు పైగా సమయం ఉందని పన్ను చెల్లింపు దారులు ఆలోచించే అవకాశం ఉంది. అయితే ఆదాయపు పన్ను చెల్లింపు గడుపు పెంచారంటూ జరుగుతున్న ప్రచారంపై ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ స్పందించింది. తప్పుడు వార్తలను ఎవరైనా ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తే గడుపు పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.

National: ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై నిషేధం ఎత్తివేత వెనుక ఏదైనా వ్యూహం ఉందా..?


గడువు పొడిగించారా..

ఐటీఆర్ దాఖలు గడువు పెంచారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. గుజరాత్‌లోని ప్రముఖ దినపత్రికలో ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగించారనే వార్త ప్రచురితమైంది. ఇది సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఐటీఆర్ ఇ-ఫైలింగ్ కోసం చివరి తేదీని ఈఏడాది ఆగష్టు 31వరకు పొడించారని వార్తలో పేర్కొన్నారు. అయితే ఈ వార్త తప్పు అని ఆదాయపు పన్ను అధికారులు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31 మాత్రమేనని స్పష్టం చేసింది.

Nirmala Sitaraman: బడ్జెట్‌పై 'వివక్ష' ముద్ర దారుణం.. మండిపడిన నిర్మలా సీతారామన్


ఆదాయపు పన్ను పేరుతో మోసం

ఫేక్ న్యూస్, టాక్స్ రీఫండ్ పేరుతో జరుగుతున్న కొత్త మోసాలను నివారించాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించింది. పన్ను వాపసు పేరుతో ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్‌లు పంపుతూ కొంతమంది మోసగాళ్లు ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని ఆ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు దాదాపు 4కోట్లకు పైగా ఐటీఆర్‌లు ఫైలింగ్ జరిగాయని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. ఇది గతేడాది కంటే 8 శాతం ఎక్కువ అధికారులు పేర్కొన్నారు.

Bangladesh: సీఎం మమత వ్యాఖ్యలపై స్పందించిన బంగ్లాదేశ్


గడువు పొడిగిస్తారా..

సాంకేతిక సమస్యల కారణంగా ఐటీఆర్‌ ఫైలింగ్‌ ఆలస్యం అవుతున్నట్లు ఫిర్యాదు వస్తున్నాయి. పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు పన్నుల దాఖలులో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరంతా గడువు పొడిగించాలని కోరుతున్నారు. ICAI, కర్ణాటక స్టేట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ (KSCAA), ఆల్ గుజరాత్ ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ కన్సల్టెంట్స్ వంటి సంస్థలు అనేక సమస్యలను పేర్కొంటూ ఆగస్టు 31, 2024 వరకు గడువును పొడిగించాలని డిమాండ్ చేశాయి.


సిస్టమ్ ఓవర్‌లోడ్ లేదా మెయింటినెన్స్ వలన వియోగదారులు పోర్టల్‌లోకి లాగిన్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఆదాయ పన్ను శాఖ గడువు పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Watch Video: సోనియాగాంధీ, జయాబచ్చన్ కలుసుకున్న వేళ...

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 25 , 2024 | 10:37 AM