Share News

ఎంటర్‌ప్రెన్యూర్ల కోసం ఐ-వెంచర్‌ ఇమ్మర్సివ్‌

ABN , Publish Date - May 09 , 2024 | 05:19 AM

ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్ల కోసం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) ఐ-వెంచర్‌ ఇమ్మర్సివ్‌ (ఐవీఐ) పేరిట ఒక ప్రోగ్రామ్‌ ప్రారంభించింది. 12 తరగతి పైబడి ఎలాంటి వ్యవస్థీకృత విద్య లేకుండానే...

ఎంటర్‌ప్రెన్యూర్ల కోసం ఐ-వెంచర్‌ ఇమ్మర్సివ్‌

హైదరాబాద్‌: ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్ల కోసం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) ఐ-వెంచర్‌ ఇమ్మర్సివ్‌ (ఐవీఐ) పేరిట ఒక ప్రోగ్రామ్‌ ప్రారంభించింది. 12 తరగతి పైబడి ఎలాంటి వ్యవస్థీకృత విద్య లేకుండానే తమకు ఆసక్తి గల రంగంలో ఇన్నోవేషన్‌కు కృషి చేసేందుకు ఈ ప్రోగ్రామ్‌ ఉపయోగకరంగా ఉంటుంది. అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక శిక్షణకు అడ్మిషన్లు ప్రస్తుతం జరుగుతున్నట్టు ఐఎ్‌సబీ ప్రకటించింది. హైదరాబాద్‌ క్యాంప్‌సలోనే ఇది ఫుల్‌టైమ్‌ ప్రోగ్రామ్‌గా నిర్వహిస్తారు. ఔత్సాహికులు తమ నవ్య ఆలోచనలను ఆచరణీయం చేయడానికి అవసరం అయిన నిధుల కల్పన కూడా ఈ కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉంటుంది.

Updated Date - May 09 , 2024 | 05:19 AM