Share News

Dating App: డేటింగ్ యాప్ స్థాపించిన ఏడాదిలో పెట్టుబడిదారుల నుంచి రూ.20 కోట్లు సేకరణ

ABN , Publish Date - Aug 07 , 2024 | 08:34 PM

ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది! మీరు మీ జీవితంలో మార్పును కోరుకుంటే, మీ జీవితంలో కొత్త ఆలోచనలను అలవర్చుకోవాలి. వాటిలో మంచి ఓ మంచి ఐడియాను తీసుకుని అమలు పరిస్తే మీ జీవితమే మారిపోయే అవకాశం ఉంటుంది. అచ్చం ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఇటివల ఇద్దరు కలిసి ఓ స్టార్టప్ ప్రారంభించారు. అంతే అది క్లిక్ కావడంతో ఏడాదిలోనే పెట్టుబడిదారులు ఆ కంపెనీలో 20 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అదే డేటింగ్ యాప్(dating app) జూలియో(Julio).

Dating App: డేటింగ్ యాప్ స్థాపించిన ఏడాదిలో పెట్టుబడిదారుల నుంచి రూ.20 కోట్లు సేకరణ
Julios dating app

ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది! మీరు మీ జీవితంలో మార్పును కోరుకుంటే, మీ జీవితంలో కొత్త ఆలోచనలను అలవర్చుకోవాలి. వాటిలో మంచి ఓ మంచి ఐడియాను తీసుకుని అమలు పరిస్తే మీ జీవితమే మారిపోయే అవకాశం ఉంటుంది. మీ ప్రత్యేక ఆలోచనలు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తాయి. మీమ్మల్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. ఇటివల ఇద్దరు కలిసి ఓ స్టార్టప్ ప్రారంభించారు. అంతే అది క్లిక్ కావడంతో ఏడాదిలోనే పెట్టుబడిదారులు ఆ కంపెనీలో 20 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అదే డేటింగ్ యాప్(dating app) జూలియో(Julio).


ఈ యాప్

దీనిలో ఏడుగురు యునికార్న్ వ్యవస్థాపకులతో సహా 180 కంటే ఎక్కువ అనుభవజ్ఞులైన పెట్టుబడిదారుల నుంచి ఏంజెల్ ఫండింగ్ రౌండ్‌లో $2.5 మిలియన్లను (రూ.20,98,36,000) సేకరించినట్లు ఇటివల ప్రకటించారు. ఏంజెల్ ఇన్వెస్టర్ల జాబితాలో లివ్‌స్పేస్ వ్యవస్థాపకుడు రమాకాంత్ శర్మ, క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా, ఎకో సహ వ్యవస్థాపకుడు రుచి దీపక్, మాజీ JP మోర్గాన్ ఇండియా ఛైర్మన్ లియో పూరి, గ్రో వ్యవస్థాపకులు హర్ష్ జైన్, లలిత్ కేషారే ఉండటం విశేషం. ఈ డేటింగ్ యాప్ స్టార్టప్ జూలియో 2023లో చిరంజీవ్ ఘాయ్, వరుణ్ సూద్ ద్వారా ప్రారంభించబడింది.


ప్రేమ, పెళ్లి

ఈ భారతీయ డేటింగ్ యాప్ ప్రేమ, వివాహాం వంటి అంశాలకు వేదికగా ఉంటుంది. డేటింగ్ యాప్‌లు.. బర్న్‌అవుట్, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులకు సహాయం చేయడమే మా ఉద్దేశమని జూలియో వ్యవస్థాపకుడు CEO వరుణ్ సూద్ అన్నారు. నిజమైన ప్రేమను కనుగొనడానికి వారికి సురక్షితమైన, విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన సేవను అందించడమే మా లక్ష్యమన్నారు. ఈ క్రమంలో మాకు మద్దతు ఇచ్చిన మా అనుభవజ్ఞులైన స్నేహితులు, కుటుంబ సభ్యులకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వరుణ్ తెలిపారు.

అయితే ఏడాదిలోపే ఈ స్టార్టప్ నిధులను సేకరించడం పట్ల కంపెనీ ఉద్యోగులతోపాటు వ్యవస్థాపకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూలియో ప్రస్తుత కాలంలోని యువత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో తయారైందని ఇన్వెస్టర్లలో ఒకరైన లివ్‌స్పేస్ వ్యవస్థాపకుడు రమాకాంత్ శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిలో ప్రయాణం చాలా ఉత్సాహంగా ఉందన్నారు.


ఇవి కూడా చదవండి:

Alert: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులో ఉపశమనం.. ఎప్పటివరకంటే


Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 07 , 2024 | 08:39 PM