Share News

48 శాతం తగ్గిన లారస్‌ ల్యాబ్స్‌

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:26 AM

జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి గాను లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌ రూ.1,195 కోట్ల రెవెన్యూపై రూ.13 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే...

48 శాతం తగ్గిన లారస్‌ ల్యాబ్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి గాను లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌ రూ.1,195 కోట్ల రెవెన్యూపై రూ.13 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 1 శాతం, లాభం 48 శాతం తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో కీలకమైన సీడీఎంఓ క్లినికల్‌ ప్రాజెక్టుల్లో నిలకడైన పనితీరుతో పాటు అంకాలజీ ఏపీఐ, ఏఆర్‌వీ విభాగంలో పటిష్ఠమైన వృద్ధి ని కనబరచటం కలిసివచ్చిందని లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ సత్యనారాయణ చావా తెలిపారు. ఈ కాలంలో కంపెనీ సీడీఎంఓ-సింథసిస్‌ వ్యాపారం రూ.214 కోట్లుగా ఉండ గా ఏపీఐ రెవెన్యూ రూ.664 కోట్లుగా ఉంది.

Updated Date - Jul 26 , 2024 | 04:26 AM