Share News

Paytm: అదానీ గ్రూప్‌కు పేటీఎం వాటా విక్రయంపై కీలక ప్రకటన

ABN , Publish Date - May 29 , 2024 | 10:38 AM

పేటీఎం(Paytm)లో వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్(Adani Group) సిద్ధమైందని ఇటివల వచ్చిన వార్తల్లో నిజం లేదని Paytm వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ(vijay shekhar sharma) స్పష్టం చేశారు. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే అని దీనికి సంబంధించి ఎలాంటి చర్చలో పాల్గొనడం లేదని తెలిపారు.

 Paytm: అదానీ గ్రూప్‌కు పేటీఎం వాటా విక్రయంపై కీలక ప్రకటన
Paytm Denies Paytm Stake Sale to Adani Group

పేటీఎం(Paytm)లో వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్(Adani Group) సిద్ధమైందని ఇటివల వచ్చిన వార్తల్లో నిజం లేదని Paytm వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ(vijay shekhar sharma) స్పష్టం చేశారు. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే అని దీనికి సంబంధించి ఎలాంటి చర్చలో పాల్గొనడం లేదని తెలిపారు. ఈ విషయంలో కంపెనీ ఎలాంటి చర్చల్లో పాల్గొనడం లేదని పేటీఎం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేశారు. పేటీఏం ఎల్లప్పుడూ మా బాధ్యతలకు అనుగుణంగా సేవలందిస్తుందని వెల్లడించారు.


అయితే ఈ డీల్ ఖరారు చేయడానికి గౌతమ్ అదానీ, విజయ్ శేఖర్ శర్మ మంగళవారం అహ్మదాబాద్‌లో సమావేశమయ్యారని ఓ నివేదిక తెలిపింది. ఇది మాత్రమే కాదు, Paytm ఆపరేటర్‌లో తన పెట్టుబడిని కాపాడుకోవడానికి అదానీ పశ్చిమ ఆసియా ఫండ్‌లతో చర్చలు జరుపుతున్నట్లు మీడియా నివేదికలు(media reports) పేర్కొన్నాయి. దీంతో అదానీ గ్రూప్ చెల్లింపు రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు పలు మీడియాలలో కథనాలు వచ్చాయి.


ఇటివల పేటీఎం నాలుగో త్రైమాసికం (Q4)లో ఊహించిన దానికంటే ఎక్కువ నష్టాన్ని నమోదు చేసింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్(One 97 Communications Ltd) నాలుగో త్రైమాసికంలో నష్టం రూ.551 కోట్లకు పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన, Paytm నష్టం రూ.221.7 కోట్ల నుంచి రూ.551 కోట్లకు పెరిగింది. ఈ క్రమంలో వ్యాపారంలో నష్టం కారణంగా Paytm ఆదాయం కూడా 20.5% తగ్గి రూ.2,267 కోట్లకు చేరుకుంది. జనవరి 31న రిజర్వ్ బ్యాంక్ విధించిన చర్యల కారణంగా పేటీఎం వాలెట్, బ్యాంకింగ్ సేవలపై ప్రభావం చూపింది.


ఇది కూడా చదవండి:

Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే

CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు


Read Latest Business News and Telugu News

Updated Date - May 29 , 2024 | 10:41 AM