Share News

Post Office Scheme: తక్కువ పెట్టుబడితో అదిరిపోయే స్కీమ్.. రూ.8 లక్షలు పొందే ఛాన్స్..!

ABN , Publish Date - Sep 02 , 2024 | 09:34 PM

Post Office Scheme: ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునే వారికి సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(India Post Payments Bank) అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సురక్షితమైన పెట్టుబడితో పాటు..

Post Office Scheme: తక్కువ పెట్టుబడితో అదిరిపోయే స్కీమ్.. రూ.8 లక్షలు పొందే ఛాన్స్..!
Post Office Scheme

Post Office Scheme: ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునే వారికి సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(India Post Payments Bank) అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సురక్షితమైన పెట్టుబడితో పాటు.. మంచి ఆదాయాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్‌లో అనేక సేవింగ్స్ స్కీమ్ ఉన్నాయి. వీటిలో పెట్టుబడి/పొదుపు చేయడం ద్వారా అధిక రాబడిని పొందవచ్చు. అలాంటి ఓ స్కీమ్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం.


ఎవరైనా సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే.. పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మరింత సురక్షితమైనది. మెరుగైన రాబడిని కూడా ఇస్తుంది. ఇక పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభదాయకమైన ఆదాయం పొందవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 ​సంవత్సరాలు. దీనిని 10 సంవత్సరాల వరకు పొడిగించవుకోచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 6.7% వడ్డీ లభిస్తుంది. ఇది చాలా లాభదాయకమైన, సురక్షితమైన ప్లాన్.


ఈ పథకంలో పెట్టుబడిని రూ. 100 నుండి ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. అలాగే, 12 వాయిదాలు కంటిన్యూగా జమ చేస్తే రుణ సౌకర్యం ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత మీరు మీ ఖాతాలో జమ చేసిన మొత్తంలో 50 శాతం వరకు రుణం తీసుకోవచ్చు.

10 ఏళ్ల తర్వాత రూ. 8 లక్షలు ఎలా?

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ప్రతి నెలా రూ. 5,000 పెట్టుబడి పెడితే.. దాని మెచ్యూరిటీ వ్యవధిలో అంటే ఐదేళ్లలో, మీరు మొత్తం రూ. 3 లక్షలు డిపాజిట్ చేస్తారు. 6.7 శాతంతో 56,830 చక్రవడ్డీని పొందుతారు. ఫలితంగా మొత్తం రూ. 3,56,830 అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఖాతాను మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తే.. అంటే 10 సంవత్సరాలలో డిపాజిట్ చేసిన మొత్తం రూ. 6,00,000 అవుతుంది. అలాగే ఈ డిపాజిట్‌పై 6.7% వడ్డీ మొత్తం రూ. 2,54,272 అవుతుంది. ఈ విధంగా చూస్తే, 10 సంవత్సరాల వ్యవధిలో మీ మొత్తం ఫండ్ రూ. 8,54,272 అవుతుంది.


అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి..?

సమీపంలోని పోస్టాఫీసును సందర్శించడం ద్వారా పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు. పోస్ట్ ఆఫీస్ Rdలో మైనర్ పేరు మీద ఖాతాను తెరవవచ్చు. ఇందులో తల్లిదండ్రులు డాక్యూమెంట్స్ కూడా సమర్పించాల్సి ఉంటుంది.


Also Read:

30 గంటల తర్వాత గుడ్‌న్యూస్.. రాకపోకలు మొదలు

సిగ్గు తెచ్చుకోండి ముఖ్యమంత్రి గారు: కేటీఆర్..

గోడలపై కమలం పెయింట్లు వేశా..

For More Business News and Telugu News..

Updated Date - Sep 02 , 2024 | 09:34 PM