Share News

Post Office Schemes: ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో పోస్ట్ ఆఫీసులో వడ్డి రేట్లు ఎలా ఉన్నాయంటే..?

ABN , Publish Date - Mar 30 , 2024 | 01:33 PM

ప్రతి మూడు నెలలకోసారి చిన్న మొత్తాల పథకాల్లో వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం మారుస్తోంది. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో వడ్డీరేట్లను మార్చలేదు. జనవరి 2024 మాదిరిగా వడ్డీ రేట్లను ఉంచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Post Office Schemes: ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో పోస్ట్ ఆఫీసులో వడ్డి రేట్లు ఎలా ఉన్నాయంటే..?

ప్రతి మూడు నెలలకోసారి చిన్న మొత్తాల పథకాల్లో వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం మారుస్తోంది. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో వడ్డీరేట్లను మార్చలేదు. జనవరి 2024 మాదిరిగా వడ్డీ రేట్లను ఉంచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చిన్న మొత్తాల పొదుపు పథకంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిపికేట్ (NSC) పథకాలు ఉన్నాయి.

వడ్డీ ఇలా జమ

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌లో నగదు ఉంటే సంవత్సరం 4 శాతం వడ్డీ కలుస్తోంది. ఒక సంవత్సర నగదు డిపాజిట్ చేస్తే 6.9 శాతం వడ్డీ వస్తోంది. రూ.10 వేలు డిపాజిట్ చేస్తే 6.9 శాతం వడ్డీ చొప్పున మూడు నెలలకు రూ.708 జమ అవుతాయి. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్‌లో భాగంగా 8.2 శాతం వడ్డీ జమ అవుతుంది. త్రైమాసికానికి రూ.205 వడ్డీ కలుస్తోంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో భాగంగా రూ.10 వేలు డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.14,490 వస్తాయి. పీపీఎఫ్ ఏడాదికి 7.1 శాతం, కిసాన్ వికాస్ పత్ర ఏడాదికి 7.5 శాతం, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ 3 నెలలకు 7.5 శాతం, సుకన్య సమృద్ది అకౌంట్ ఏడాదికి 8.2 శాతం వడ్డీ కలుస్తుంది.

పన్ను నుంచి మినహాయింపు

చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం సమయానుకూలంగా అంచనా వేస్తోంది. వడ్డీ రేట్లను శ్యామలా గోపీనాథ్ కమిటీ ప్రతిపాదించింది. 2023 డిసెంబర్ త్రైమాసికంలో కొన్ని చిన్న పొదుపు పథకాలపై ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచింది. పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం వద్ద స్థిరంగా ఉంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం పోస్ట్ ఆఫీసులో కొన్ని పథకాలకు ఆదాయపు పన్ను (Income Tax) నుంచి మినహాయింపు ఉంటుంది. సుకన్య సమృద్ది యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

New IT Rules: ఇవే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్

Layoffs: మరో టెక్ కంపెనీలో 50% ఉద్యోగుల తొలగింపు.. భయాందోళనలో..

Updated Date - Mar 30 , 2024 | 01:33 PM