Share News

Recharge Plans: జియో, ఎయిర్‌టెల్, ఐడియా.. రూ.2,999 రీచార్జ్ ప్లాన్‌లో ఏది బెటర్?

ABN , Publish Date - May 18 , 2024 | 07:15 PM

ప్రతి నెల ఫోన్ రిచార్జ్‌లు చేయించుకోవడం ఇష్టపడని వారికి టెలికాం కంపెనీలు వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉంచాయి. దేశంలో మూడు ప్రధాన టెలికాం కంపెనీలు - Jio, Airtel, Vi రూ. 2999 ధరతో వార్షిక ప్లాన్‌ను అందిస్తున్నాయి.

Recharge Plans:  జియో, ఎయిర్‌టెల్, ఐడియా.. రూ.2,999 రీచార్జ్ ప్లాన్‌లో ఏది బెటర్?

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి నెల ఫోన్ రిచార్జ్‌లు చేయించుకోవడం ఇష్టపడని వారికి టెలికాం కంపెనీలు వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉంచాయి. దేశంలో మూడు ప్రధాన టెలికాం కంపెనీలు - Jio, Airtel, Vi రూ. 2999 ధరతో వార్షిక ప్లాన్‌ను అందిస్తున్నాయి. ఈ ప్లాన్ వివిధ ప్రయోజనాలతో పాటు 365 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. Airtel, Jio, Vi లలో మంచి బెనిఫిట్స్ ఉండే వార్షిక ప్లానేంటో తెలుసుకుందాం.

రిలయన్స్ జియో..

Reliance Jio రూ.2999 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS/Day, 2.5GB రోజువారీ డేటాని, అపరిమిత 5G డేటాను అందిస్తుంది. 5G డేటాతో పాటు మొత్తం 912.5GB డేటాను అందిస్తుంది. ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటా వినియోగించిన తర్వాత నెట్ వేగం 64 Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్‌తో అదనంగా JioCloud, JioCinema, JioTV వంటి అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. సర్వీస్ వాలిడిటీ 365 రోజులు.

వోడాఫోన్ ఐడియా..

Vodafone Idea రూ. 2999 ప్లాన్‌లో రోజువారీ పరిమితి లేకుండా 850GB డేటా వస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్,100 SMS/Day, వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్స్, బింగే ఆల్ నైట్ వంటి అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ సర్వీస్ వాలిడిటీ 365 రోజులు.


భారతీ ఎయిర్‌టెల్..

భారతీ ఎయిర్‌టెల్ రూ.2999 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, 2GB రోజువారీ డేటా, 100 SMS/Day ఉన్నాయి. ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. అపరిమిత 5G డేటా, అపోలో 24|7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్‌లు, వింక్ మ్యూజిక్‌ను కూడా అందిస్తుంది.

ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా క్రీడా ఔత్సాహికుల కోసం జియో కొత్త కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రవేశపెట్టింది . JioAirFiber, JioFiber, Jio మొబిలిటీ ప్రీపెయిడ్ వినియోగదారులు ప్రీమియం స్పోర్ట్స్ OTT యాప్ అయిన ఫ్యాన్‌కోడ్‌కి ఉచిత సభ్యత్వాన్ని పొందగలరు. ఈ ఆఫర్ Jio వినియోగదారులకు ఫ్యాన్‌కోడ్‌లోని ప్రత్యేకమైన ఫార్ములా 1 (F1) కంటెంట్‌తో సహా ప్రత్యక్ష ప్రసారానికి యాక్సెస్‌ను మంజూరు చేస్తుంది.

Read National News and Telugu News

Updated Date - May 18 , 2024 | 07:15 PM