SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి
ABN , Publish Date - Apr 11 , 2024 | 12:23 PM
మీరు కోటిశ్వరులు కావాలంటే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం రోజుకు 110 రూపాయలు ఇన్‌వెస్ట్(investment) చేస్తే సరిపోతుంది. అవునండి ఇది నిజం. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో(mutual funds) పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని పొందవచ్చు.
మీరు కోటిశ్వరులు కావాలంటే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం రోజుకు 110 రూపాయలు ఇన్‌వెస్ట్(investment) చేస్తే సరిపోతుంది. అవునండి ఇది నిజం. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో(mutual funds) పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని పొందవచ్చు. కానీ ఈ స్కీమ్‌లో క్రమశిక్షణతో 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకోసం ముందుగా మీరు మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ని ఎంచుకుని రోజూ రూ.110 ఆదా చేయాలి.
ఆ విధంగా ప్రతి నెలా రూ.3,300 పెట్టుబడి పెట్టాలి. మీరు ఈ పెట్టుబడిని మొత్తం 30 ఏళ్లపాటు చేయాలి. అలా పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 30 ఏళ్ల ఇన్వెస్ట్‌మెంట్ వ్యవధిలో మొత్తం రూ.11,88,000 లక్షలను పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మీరు మీ పెట్టుబడిపై రూ.1,04,60,715 కోట్ల రాబడిని(income) పొందుతారు. ఆ తర్వాత మీ అంచనా మెచ్యూరిటీ మొత్తం 12 శాతం సగటు వార్షిక రాబడితో చివరకు మీ మెచ్యూరిటీ మొత్తం రూ. 1,16,48,715 అవుతుంది.
అయితే మ్యూచువల్ ఫండ్స్(mutual funds)లో పెట్టుబడి పెట్టిన డబ్బు మార్కెట్ రిస్క్‌ల(market risk)కు లోబడి ఉంటుందనే విషయాన్ని పెట్టుబడి దారులు గమనించాలి. ఇందులో పెట్టుబడి పెట్టే ముందు కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాలి. తెలియకుండానే మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తే నష్టాలను ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో చేసిన పెట్టుబడులపై రాబడి స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులపై ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి:
Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఎన్నికల తర్వాత..
EPFO: అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్.. ప్రయోజనాలు ఏంటంటే
మరిన్ని బిజినెస్ వార్తల కోసం