Stock Market: భారీ నష్టాల్లో దేశీయ సూచీలు.. 81 వేల దిగువకు సెన్సెక్స్..
ABN , Publish Date - Oct 18 , 2024 | 10:28 AM
సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి విడుదలవుతున్న ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడం, విదేశీ మదుపర్లు నిధుల ఉపసంహరణ కొనసాగిస్తుండడంతో దేశీయ సూచీలు నష్టాల నుంచి తేరుకోలేకపోతున్నాయి. గురువారం భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు శుక్రవారం కూడా అదే బాటలో నడుస్తున్నాయి.
సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి విడుదలవుతున్న ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడం, విదేశీ మదుపర్లు నిధుల ఉపసంహరణ కొనసాగిస్తుండడంతో దేశీయ సూచీలు నష్టాల నుంచి తేరుకోలేకపోతున్నాయి. గురువారం భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు శుక్రవారం కూడా అదే బాటలో నడుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కోలుకోలేకపోతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. ఈ రోజు ఆసియా సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే దేశీయ సూచీలు మాత్రం నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి (Business News).
గురువారం ముగింపు (81, 006)తో పోల్చుకుంటే దాదాపు 250 పాయింట్ల నష్టంతో 80, 749 వద్ద శుక్రవారం ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింతగా నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో 600 పాయింట్లు నష్టపోయి 80, 409 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది. సెన్సెక్స్ ప్రస్తుతం ఉదయం 10:20 గంటలకు 330 పాయింట్ల నష్టంతో 80, 676 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. దాదాపు 85 పాయింట్లకు పైగా నష్టంతో రోజును ప్రారంభించింది. ప్రస్తుతం 93.65 పాయింట్ల నష్టంతో 24, 666 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో విప్రో, యాక్సిస్ బ్యాంక్, పిడిలైట్ ఇండస్ట్రీస్, ఎయిచర్ మోటార్స్ లాభాల బాటలో ఉన్నాయి. మనప్పురం ఫైనాన్స్, మహానగర్ గ్యాస్, ఐజీఎల్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 254 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 274 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..