Share News

Stock Market: రికార్డుల దిశగా దేశీయ సూచీలు.. సెన్సెక్స్ 83 వేలు ప్లస్..

ABN , Publish Date - Sep 17 , 2024 | 04:13 PM

వరుసగా లాభాలు అందుకుంటూ దూసుకుపోతున్న దేశీయ సూచీలు రికార్డుల దిశగా పయనం సాగించాయి. అంతర్జాతీయంగా పలు సానుకూల సంకేతాలు నెలకొనడం కలిసొచ్చింది. అయితే వడ్డీ రేట్ల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు అమెరికా ఫెడ్ సమావేశం కానున్న నేపథ్యంలో మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరించారు.

Stock Market: రికార్డుల దిశగా దేశీయ సూచీలు.. సెన్సెక్స్ 83 వేలు ప్లస్..
Stock Market

వరుసగా లాభాలు అందుకుంటూ దూసుకుపోతున్న దేశీయ సూచీలు రికార్డుల దిశగా పయనం సాగించాయి. అంతర్జాతీయంగా పలు సానుకూల సంకేతాలు నెలకొనడం కలిసొచ్చింది. అయితే వడ్డీ రేట్ల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు అమెరికా ఫెడ్ సమావేశం కానున్న నేపథ్యంలో మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే ఎయిర్‌టెల్, ఎల్‌ అండ్ టీ వంటి హెవీ వెయిట్ షేర్లు స్వల్పంగా లాభపడడం కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది. సెన్సెక్స్ 83 వేల పైన క్లోజ్ అయింది. నిఫ్టీ 25, 400 పైన రోజును ముగించింది. (Business News).


సోమవారం ముగింపు (82, 988)తో పోల్చుకుంటే స్వల్ప లాభంతో 83, 084 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభనష్టాలతో దోబూచులాడింది. ఒక దశలో 120 పాయింట్లకు పైగా కోల్పోయి 82, 866 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. మంగళవారం సెన్సెక్స్ 82, 866-83, 152 శ్రేణి మధ్య కదలాడింది. చివరకు 90 పాయింట్ల లాభంతో 83, 079 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. దాదాపు 30 పాయింట్ల లాభంతో రోజును ప్రారంభించింది. చివరకు 34.80 పాయింట్ల లాభంతో 25, 418 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో మహానగర్ గ్యాస్, ఐజీఎల్, హీరో మోటోకార్ప్, బిర్లా సాఫ్ట్ షేర్ల లాభాలు సంపాదించాయి. బయోకాన్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్, పిరామిల్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 79 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 35 పాయింట్లు లాభపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.75గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి రేటు


బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ బ్లాక్‌బస్టర్‌ లిస్టింగ్‌


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 17 , 2024 | 04:13 PM