Share News

Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్.. రోజంతా తీవ్ర అనిశ్చిత్తిలో దేశీయ సూచీలు..!

ABN , Publish Date - Jul 23 , 2024 | 03:57 PM

కేంద్ర బడ్జెట్ సందర్భంగా దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులును ఎదుర్కొన్నాయి. రోజుంతా లాభ నష్టాలతో దోబూచులాడాయి. ఒక దశలో 1300 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకుంది. లాంగ్‌టర్మ్ క్యాపిటల్ లాభాలపై పన్నును పెంచడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్.. రోజంతా తీవ్ర అనిశ్చిత్తిలో దేశీయ సూచీలు..!
Stock Market

కేంద్ర బడ్జెట్ సందర్భంగా దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులును ఎదుర్కొన్నాయి. రోజుంతా లాభ నష్టాలతో దోబూచులాడాయి. ఒక దశలో 1300 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకుంది. లాంగ్‌టర్మ్ క్యాపిటల్ లాభాలపై పన్నును పెంచడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. వివిధ రంగాలకు ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగకపోవడంతో మదుపర్లు నిరాశపడ్డారు. మంగళవారం ఉదయం లాభలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటి తర్వాత నష్టాల బాట పట్టాయి. చివరకు సెన్సెక్స్ స్వల్ప నష్టంతో రోజును ముగించింది. (Business News).


సోమవారం ముగింపు (80, 502)తో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల నష్టంతో 80, 724 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోయింది. 80, 766 వద్ద ఇంట్రాడే హైని టచ్ చేసి అక్కడి నుంచి ఏకంగా 1500 పాయింట్లకు పైగా కోల్పోయింది. 79, 224 వద్ద ఇంట్రాడే లో కి చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ కోలుకుంది. చివరకు 73 పాయింట్ల స్వల్ప నష్టంతో 80, 429 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 24, 479 వద్ద స్థిరపడింది.


ముందుగా ఊహించిన విధంగా రైల్వే, డిఫెన్స్, ఫెర్టిలైజర్స్, పీఎస్‌యూలకు సంబంధించి మేజర్ అనౌన్స్‌మెంట్లు రాకపోవడంతో ఆయా రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్‌లో టైటాన్, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్, టోరెంట్ ఫార్మ షేర్లు లాభాలు ఆర్జించాయి. మణప్పురం ఫైనాన్స్, చంబల్ ఫెర్టిలైజర్స్, ముత్తూట్ ఫైనాన్స్, పవర్ ఫైనాన్స్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 339 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 502 పాయింట్లు నష్టపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.69గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Budget 2024: బడ్జెట్ 2024లో పెట్టుబడిదారుల స్టార్టప్‌లపై ఏంజెల్ పన్ను రద్దు


Budget 2024: కార్మికులకు అద్దె గృహాల స్కీం.. మరో 3 కోట్ల కొత్త ఇళ్లు


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 23 , 2024 | 03:57 PM