Share News

Stock Market: వారాంతంలో భారీ లాభాలు.. మళ్లీ 81 వేల పైకి సెన్సెక్స్..!

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:42 PM

కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఈ వారంలో తీవ్ర ఒడిదుడుకులును ఎదుర్కొన్న సూచీలు వారంలో చివరి రోజు మాత్రం భారీ లాభాలను ఆర్జించాయి. రోజుంతా లాభాల బాటల పయనించాయి. శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరును కొనసాగించింది.

Stock Market: వారాంతంలో భారీ లాభాలు.. మళ్లీ 81 వేల పైకి సెన్సెక్స్..!
Stock Market

కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఈ వారంలో తీవ్ర ఒడిదుడుకులును ఎదుర్కొన్న సూచీలు వారంలో చివరి రోజు మాత్రం భారీ లాభాలను ఆర్జించాయి. రోజుంతా లాభాల బాటల పయనించాయి. శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరును కొనసాగించింది. మళ్లీ 81 వేల పైన రోజును ముగించింది. సెన్సెక్స్ బాటలోనే నిఫ్టీ కూడా భారీ లాభాలను ఆర్జించింది. (Business News).


గురువారం ముగింపు (80, 039)తో పోల్చుకుంటే దాదాపు 100 పాయింట్ల లాభంతో 80, 158 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ రోజంతా లాభాల జోరు కొనసాగించింది. ఒక దశలో 1400 పాయింట్లకు పైగా లాభపడి 81, 427 వద్ద ఇంట్రాడే హైని టచ్ చేసింది. చివరకు 1292 పాయింట్ల లాభంతో 81, 332 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. నిఫ్టీ 437 పాయింట్లు లాభపడి 24, 8439 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఫోర్జ్, ఎంఫసిస్, అశోక్ లేలాండ్, పిరామిల్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు లాభాలు ఆర్జించాయి. యునైటెడ్ బ్రూవరీస్, ఫెడరల్ బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్, ఎస్బీఐ కార్డ్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 541 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 438 పాయింట్లు ఎగబాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.72గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Jobs: వచ్చే 10 ఏళ్ల తర్వాత ఈ ఉద్యోగాలుండవు.. లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుడి అంచనా


Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 26 , 2024 | 03:42 PM