Share News

Stock Market Updates: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..రికార్డు నష్టాల్లో వొడాఫోన్ ఐడియా!

ABN , Publish Date - Feb 28 , 2024 | 01:41 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock markets) బుధవారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌ఈ(NSE) నిఫ్టీ, BSE సెన్సెక్స్ బుధవారం మిడ్ సెషన్ నాటికి సగం శాతం పైగా పడిపోయాయి.

Stock Market Updates: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..రికార్డు నష్టాల్లో వొడాఫోన్ ఐడియా!

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock markets) బుధవారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌ఈ(NSE) నిఫ్టీ, BSE సెన్సెక్స్ బుధవారం మిడ్ సెషన్ నాటికి సగం శాతం పైగా పడిపోయాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు సెన్సెక్స్ 690 పాయింట్లు క్షీణించి 72,400 పరిధిలో ఉండగా.. నిఫ్టీ 204 పాయింట్లు 21,900 ఎగువన ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాపీ సూచీలు కూడా వరుసగా 478, 860 పాయింట్లు కోల్పోయాయి.

ఈ నేపథ్యంలో అపోలో హాస్పిటల్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ కార్ప్, మారుతి సుజుకి, అదానీ ఎంటర్‌ప్రైస్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా.. SBI లైఫ్ ఇన్సూరెన్స్, TCS, HUL, ఇన్ఫోసిస్, HDFC లైఫ్ వంటి కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే నేడు NSEలో 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్న ప్రధాన స్టాక్‌లు ఉన్నాయి. వాటిలో పోద్దార్ పిగ్మెంట్స్ (11.78%), ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (10%), జునిపర్ హోటల్స్ (10%), వీగార్డ్ ఇండస్ట్రీస్ (3.88%), Aster DM హెల్త్‌కేర్ (2.54%) కలవు.


మరోవైపు అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా(vodafone idea) లిమిటెడ్ షేర్లు బుధవారం 10 శాతం పడిపోయాయి. కంపెనీ మంగళవారం తన ఫండ్ రైజింగ్ ప్లాన్‌ను ప్రకటించింది. అయితే ఇది పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను మార్చడంలో సహాయపడలేదు. బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు 9.95 శాతం పడిపోయి రూ.14.29కి చేరాయి. ఇది దీని దిగువ సర్క్యూట్ కావడం విశేషం. వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్ సాధనాల ద్వారా రూ. 20,000 కోట్లను సమీకరించడానికి బోర్డు ఆమోదం పొందింది. మరోవైపు ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం షేర్లు కూడా దిగువకు పయనిస్తున్నాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Navy Seizes: ఏకంగా 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత.. కేంద్ర హోంమంత్రి అభినందన

Updated Date - Feb 28 , 2024 | 01:41 PM