Share News

Stock Markets: నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. కానీ సాయంత్రం మాత్రం..

ABN , Publish Date - Nov 20 , 2024 | 10:20 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం క్లోజ్‌లో ఉంటాయి. నేడు మహారాష్ట్ర ఎన్నికల ఓటింగ్ నేపథ్యంలో బంద్ ఉంటాయని ప్రకటించారు. కానీ సాయంత్రం మాత్రం కొన్ని రకాల ట్రేడింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Stock Markets: నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. కానీ సాయంత్రం మాత్రం..
Stock markets closed

నేడు (నవంబర్ 20) బుధవారం స్టాక్ మార్కెట్‌లో (stock markets) ఉదయం సమయంలో ట్రేడింగ్ ఉండదు. ఈరోజున ఈక్విటీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ), సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB) విభాగాల్లో ఎలాంటి ట్రేడింగ్ ఉండదని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బీఎస్‌ఈలు ప్రకటించాయి. అయితే మహారాష్ట్రలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కమోడిటీ మార్కెట్ బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసివేయబడుతుంది.


సాయంత్రం మాత్రం

అయితే సాయంత్రం సెషన్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ట్రేడింగ్ కొనసాగుతుంది. ఇది సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:55 గంటల వరకు తెరిచే ఉంటుంది. కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు రాత్రి 9 గంటల వరకు జరుగుతాయి. ఎన్నికల సంఘం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 15, 2024న ప్రకటించింది. ఈ క్రమంలో 288 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతుండగా, 4,136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు శనివారం నవంబర్ 23, 2024న జరుగుతుంది.


ఈరోజు బ్యాంకులకు కూడా సెలవు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం నవంబర్ 20 న మహారాష్ట్ర అంతటా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి. అంతరాయం లేని ఆర్థిక లావాదేవీలను నిర్ధారించడానికి ATMలు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు.


నిన్న మార్కెట్ ఎలా ఉంది?

భారత స్టాక్ మార్కెట్లో వరుసగా ఏడు రోజు క్షీణత మంగళవారంతో ముగిసింది. సెన్సెక్స్ 239.37 పాయింట్ల లాభంతో 77,578.38 వద్ద, నిఫ్టీ-50 64.70 పాయింట్ల లాభంతో 23,472.75 వద్ద ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు పెరగడం మార్కెట్‌ను బలపరిచింది. దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కూడా ఇండెక్స్‌కు మద్దతునిచ్చాయి. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 1,100 పాయింట్లు పెరిగింది. అయితే నిఫ్టీలోని 50 కంపెనీలలో 27 కంపెనీల షేర్లు చివరి గంటలో అమ్మకాల కారణంగా లాభాలు పరిమితమయ్యాయి.


చివరి సమయంలో

కానీ ట్రేడింగ్ చివరి గంటలో రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా విదేశీ పెట్టుబడిదారులు (FIIs) భారీ అమ్మకాల కారణంగా మార్కెట్ లాభాలను కోల్పోయింది. మంగళవారం నాటి సెషన్‌లో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3411 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) రూ.2783.89 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అక్టోబర్ 2024 తర్వాత విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు నవంబర్ నెలలో కొనసాగుతాయి. నవంబర్ మొదటి పక్షం రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.22420 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.


ఇవి కూడా చదవండి:

Chrome Browser: గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను సేల్ చేస్తున్నారా.. అమెరికా ప్రభుత్వం..

PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 20 , 2024 | 10:24 AM