Share News

Stock Market: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. క్షణాల్లోనే లక్షల కోట్లు హాం ఫట్

ABN , Publish Date - Nov 18 , 2024 | 10:03 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో మొదలై, క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్బీఐ సమీక్ష నేపథ్యంలో మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఇప్పుడు చుద్దాం.

Stock Market: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. క్షణాల్లోనే లక్షల కోట్లు హాం ఫట్
stock markets losses

దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) సోమవారం (నవంబర్ 18) భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో అన్ని సూచీలు గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. కానీ ఆ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ ఎరుపులోకి జారుకున్నాయి. దీంతో మిగతా సూచీలు కూడా రెడ్‌లోకి మారాయి.

ఈ నేపథ్యంలో ఉదయం 9.53 నిమిషాల నాటికి సెన్సెక్స్ 421 పాయింట్ల నష్టంతో 77,159 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 137 పాయింట్లు తగ్గి 23,396 పరిధిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 50,249 స్థాయిలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 152 పాయింట్లు నష్టపోయింది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.


ప్రధానంగా ఈ స్టాక్స్

ప్రారంభ ట్రేడింగ్‌లో మెటల్, ఆటో రంగ షేర్లు మంచి వృద్ధిని నమోదు చేశాయి. హిందాల్కో 4% కంటే ఎక్కువ పెరిగింది. హీరో మోటోకార్ప్, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, బీఈఎల్ అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. డాక్టర్ రెడ్డిస్, ఇన్ఫోసిస్, బ్రిటానియా, గ్రాసిమ్, విప్రోలు అత్యధికంగా క్షీణించాయి దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా కాలం తర్వాత క్షీణించాయి. దాదాపు ఒకటిన్నర నెలలుగా మార్కెట్‌లో విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంచ్‌మార్క్ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 9 నుంచి 10 శాతం పడిపోయాయి.


చైనాకు బదులుగా

గత వారం నిఫ్టీ 200 రోజుల సగటు కంటే దిగువకు పడిపోయింది. ఇక ఈ వారం కూడా నెగిటివ్ ట్రిగ్గర్లతోనే ప్రారంభం అవుతుండటం ఆందోళన కలిగించే అంశమని చెప్పవచ్చు. అయితే గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ CLSA భారత్‌పై అధిక రేటింగ్‌ను ఇచ్చింది. అమెరికాలో ట్రంప్ విజయం తర్వాత, బ్రోకరేజ్ చైనాకు బదులుగా భారతదేశ మార్కెట్‌ను మొదటి ఎంపికగా పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే రేట్లు తగ్గించడానికి తొందరపడదని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ రేటు తగ్గింపును వాయిదా వేసే అవకాశం ఉండటంతో అమెరికన్ మార్కెట్లు భయపడ్డాయి. గత 2 రోజుల్లో డౌ 500 పాయింట్లు, నాస్‌డాక్ 550 పాయింట్లు పతనమయ్యాయి.


ఈ రంగాల్లో తగ్గింపులు

బంగారం ధరలు మళ్లీ పడిపోగా, క్రూడ్ 71 డాలర్లకు పడిపోయింది. చైనా అణిచివేత కారణంగా LME అల్యూమినియం 5.5% పెరిగింది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు షాక్ ఇస్తూ కేటాయింపు తగ్గించింది. సెక్టార్లలో, IT ఇండెక్స్ టాప్ డ్రాగ్‌గా 1.29 శాతం పడిపోయింది. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, ఆయిల్ సూచీలు కూడా కోతలతో ట్రేడవుతున్నాయి. దీనికి విరుద్ధంగా మెటల్, రియాల్టీ సూచీలు వరుసగా 1.66 శాతం, 1.16 శాతం పెరిగాయి. మరోవైపు డౌ ఫ్యూచర్స్ దాదాపు 50 పాయింట్లు పెరుగగా, ఆసియాలో నిక్కీ 200 పాయింట్లు బలహీనపడింది.


ఇవి కూడా చదవండి:

Rupee: డాలర్‌తో పోల్చితే డేంజర్ జోన్‌లో రూపాయి.. కారణమిదేనా..


PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..

Viral News: లష్కరే తోయిబా అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫోన్.. తర్వాత ఏమైందంటే..

Air Pollution: రాజధానిలో దారుణం.. ఐదో రోజు అదే వాయు కాలుష్యం, బతికేదేలా..


Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More International News and Latest Telugu News

Updated Date - Nov 18 , 2024 | 10:26 AM