Share News

Stock Markets: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ట్రెండ్ ఇలాగే ఉంటుందా..

ABN , Publish Date - Aug 12 , 2024 | 09:35 AM

భారత స్టాక్ మార్కెట్లు సోమవారం (ఆగస్టు 12న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, హిండెన్‌బర్గ్ నివేదిక భయంతో మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది.

Stock Markets: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ట్రెండ్ ఇలాగే ఉంటుందా..
Stock market updates telugu

భారత స్టాక్ మార్కెట్లు(stock markets) సోమవారం (ఆగస్టు 12న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, హిండెన్‌బర్గ్ నివేదిక భయంతో మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉదయం సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లు నష్టపోయింది. అదే సమయంలో నిఫ్టీ 24,300 పరిధిలో ట్రేడైంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 సూచీ దాదాపు 100 పాయింట్లు పడిపోయింది. నేటి ట్రేడింగ్ ఎక్కువగా నష్టాల వైపు మొగ్గుచూపేలే కనిపిస్తుంది.


అదానీ స్టాక్స్

అయితే గత వారాంతంలో హిండెన్‌బర్గ్ నివేదికలో సెబీ చీఫ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఉదయాన్నే గిఫ్ట్ నిఫ్టీ 44 పాయింట్ల పతనంతో 24,357 వద్ద మొదలైంది. చాలా రంగాల సూచీలు బలహీనతతో ట్రేడవుతున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ స్టాక్స్‌పై కనిపించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్, అదానీ పోర్ట్స్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్, అదానీ విల్మార్‌తో పాటు ఏసీసీ, అంబుజా సిమెంట్స్ షేర్లలో క్షీణత కనిపించింది.


అంతర్జాతీయంగా

శుక్రవారం అమెరికా మార్కెట్ లాభాలతో ముగిసింది. డౌ జోన్స్ 0.1 శాతం పెరగగా, S&P 500, NASDAQ 0.5 శాతం లాభపడ్డాయి. US 10 సంవత్సరాల బాండ్ రాబడులు 4 శాతం కంటే తక్కువగా స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ ఫ్యూచర్లు దాదాపు $2,470 వద్ద ఉన్నాయి. WTI క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $77కు చేరాయి. ఇక ఆసియాలో జపాన్ నిక్కీ 0.6 శాతం పెరిగింది. కోస్పి తైవాన్ 1 శాతం లాభపడగా, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.8 శాతం పడిపోయాయి.


వీటిపై నిషేధం

F&O నిషేధంలో కొత్తగా చేర్చబడిన స్టాక్‌లలో బంధన్ బ్యాంక్, బయోకాన్, గ్రాన్యూల్స్ ఇండియా, సెయిల్. మరోవైపు F&O నిషేధంలో ఇప్పటికే చేర్చబడిన స్టాక్‌ల పేర్లు ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్, బిర్లాసాఫ్ట్, GNFC, హిందుస్థాన్ కాపర్, ఇండియా సిమెంట్స్, ఇండియామార్ట్ ఇంటర్‌మేష్, LIC హౌసింగ్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, RBL బ్యాంక్. F&O నిషేధం నుంచి తీసివేయబడిన స్టాక్‌ల సంఖ్య సున్నా.


ఇవి కూడా చదవండి:

Gold and Silver Rate Updates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. ఎంతకు చేరాయంటే..


Multibagger Stock: రూ.1,113 నుంచి రూ.10,310కి చేరిన షేర్ ప్రైస్.. ఐదేళ్లలోనే మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి..


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 12 , 2024 | 09:51 AM