Share News

తొలి త్రైమాసికం వృద్ధి 7.5 శాతం

ABN , Publish Date - May 22 , 2024 | 05:37 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024 -25) మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అంచనా వేసింది. వస్తు సేవలకు...

తొలి త్రైమాసికం వృద్ధి 7.5 శాతం

ఆర్‌బీఐ అంచనా

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024 -25) మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అంచనా వేసింది. వస్తు సేవలకు డిమాండు పెరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర వ్యయాల పెరుగుదల కూడా ఇందుకు దోహదపడనున్నట్టు తాజా బులెటిన్‌లో తెలిపింది. తీవ్రమైన భోగోళిక, రాజకీయ ప్రతికూలతల మధ్యన కూడా భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోగలిగిందని పేర్కొంటూ ఏప్రిల్‌లో ఆర్థిక కార్యకలాపాల సూచీ (ఈఏఐ) పునరుజ్జీవం సాధించినట్టు తెలిపింది. అధిక సాంద్రత గల 27 కీలక సూచీల గమనాన్ని పరిగణనలోకి తీసుకుని డైనమిక్‌ ఫ్యాక్టర్‌ నమూనాలో ఈఏఐని నిర్మించారు. ఇదిలా ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం జీడీపీ గణాంకాలను, 2023-24 జాతీయాదాయం గణాంకాలను ప్రభుత్వం ఈ నెల 31వ తేదీన ప్రకటించనుంది. ఆర్థిక వ్యవస్థకు కీలకంగా పరిగణించే వాటిలో టోల్‌ వసూళ్ల సూచీ ఏప్రిల్‌లో 8.6 శాతం వృద్ధిని నమోదు చేయగా ఇదే నెలలో ఆటోమొబైల్‌ అమ్మకాలు 25.4 శాతం పెరిగాయి.


ఆర్థిక వ్యవస్థ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టేకా్‌ఫకు సిద్ధంగా ఉన్నదన్న ఆశావహ దృక్పథం సర్వత్రా వెలువడుతోందని మైకేల్‌ దేవవ్రత పాత్రా నాయకత్వంలోని బృందం రచించిన ఆ నివేదిక వెల్లడించింది. ద్రవ్యోల్బణం విషయానికి వస్తే కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, మాంసం, చేపల ధరలు సమీప భవిష్యత్తులో దాన్ని కాస్తంత అధికంగా 5 శాతానికి చేరువలో నిలుపుతాయని పేర్కొన్నారు.

Updated Date - May 22 , 2024 | 05:37 AM