కొత్త ఇళ్ల సరఫరా తగ్గింది
ABN , Publish Date - Mar 30 , 2024 | 04:16 AM
హైదరాబాద్ సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా జనవరి-మార్చి త్రైమాసికంలో సగటున 15 శాతం తగ్గిందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ తాజా నివేదికలో తెలిపింది...
కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా జనవరి-మార్చి త్రైమాసికంలో సగటున 15 శాతం తగ్గిందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ తాజా నివేదికలో తెలిపింది. బెంగళూరు, ముంబై నగరాల్లో మాత్రం సరఫరా స్వల్పంగా పెరిగిందని; ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో తగ్గిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా గత ఏడాది ఇదే త్రైమాసికంలో 81,167 ఇళ్లు అందుబాటులోకి రాగా ఈ ఏడాది 69,143 యూనిట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. హైదరాబాద్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇళ్లు గత ఏడాది జనవరి-మార్చితో పోల్చితే 14,371 యూనిట్ల నుంచి 11,090కి తగ్గాయి. ఈ ఎనిమిది నగరాల్లోనూ మొత్తం ఇళ్ల అమ్మకా ల్లో విలాసవంతమైన భవనాల వాటా 34 శాతం ఉన్నట్టు పేర్కొంది.