Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధర
ABN , Publish Date - Aug 08 , 2024 | 07:48 AM
బంగారం కొనుగోలు చేయాలని అనుకునేవారికి శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర భారీగా తగ్గింది. నిన్న రూ.870 తగ్గిన ధర, ఇవాళ రూ.430 తగ్గింది. రెండురోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1300 వరకు తగ్గింది. గోల్డ్ రేట్ తగ్గడంతో మహిళా మణులు అన్ని పనులు మానుకొని మరి బంగారం షాపు వద్దకొస్తున్నారు.
హైదరాబాద్: బంగారం (Gold) కొనుగోలు చేయాలని అనుకునేవారికి శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర భారీగా తగ్గింది. నిన్న రూ.870 తగ్గిన ధర, ఇవాళ రూ.430 తగ్గింది. రెండురోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1300 వరకు తగ్గింది. గోల్డ్ రేట్ తగ్గడంతో మహిళా మణులు అన్ని పనులు మానుకొని మరి బంగారం షాపు వద్దకొస్తున్నారు. శ్రావణ మాసం ప్రారంభమైంది. మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెలలో లక్ష పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో బంగారానికి మంచి డిమాండ్ ఉంటుంది. గోల్డ్ రేట్ తగ్గుతూ వస్తోంది. బంగారంతోపాటు వెండి ధర కూడా తగ్గింది.
బంగారం ధర | 10 గ్రాములు (22 క్యారెట్లు) | 10 గ్రాములు (24 క్యారెట్లు) |
హైదరాబాద్ | 63,500 | 69,270 |
విజయవాడ | 63,490 | 69,260 |
హైదరాబాద్‌లో ఇలా..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,500గా ఉంది. మేలిమి బంగారం రూ.69,270గా ఉంది. విశాఖపట్టణం, విజయవాడలో బంగారం ధరల్లో తేడా లేదు. 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,260గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.63,650గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,420గా ఉంది. వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.87 వేలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.82,000గా ఉంది.
బంగారం ధర | 10 గ్రాములు (22 క్యారెట్లు) | 10 గ్రాములు (24 క్యారెట్లు) |
విశాఖపట్టణం | 63,490 | 69,260 |
ఢిల్లీ | 63,650 | 69,420 |