Share News

Financial Fraud: ఆర్థిక మోసాల బారిన పడ్డారా? వెంటనే ఇలా చేయండి!

ABN , Publish Date - Sep 21 , 2024 | 08:45 PM

ఆర్థిక మోసాల బారిన పడ్డ వారు వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయడంతో పాటు, పోలీసులు, జాతియ దర్యాప్తు సంస్థలకు తక్షణం కంప్లెయింట్ ఇస్తే పోయిన డబ్బు తిరిగొచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Financial Fraud: ఆర్థిక మోసాల బారిన పడ్డారా? వెంటనే ఇలా చేయండి!

ఇంటర్నెట్ డెస్క్: అనుమానాస్పద లావాదేవీ జరిగిందంటూ బ్యాంక్ నుంచి మెసేజ్, లేని సర్వీసుకు భారీ బిల్లు చెల్లించాలంటూ మరో సందేశం.. ఇలాంటి మెసేజీలు చూస్తే గుండె ఆగిపోయినంత పనవుతుంది. కష్టపడి సంపాదించిన మొత్తం ఏమైపోయిందోనన్న భయం నిలువెల్లా ఆవరిస్తుంది. దురదృష్టవశాత్తూ, దేశంలో నిత్యం ఎందరో ఇలాంటి ఆర్థిక మోసాల బారిన పడుతున్నారు (Cyber Fraud).

Own Vs Rent : సొంత ఇల్లు వర్సెస్ అద్దె ఇల్లు! దీర్ఘకాలంలో ఏది లాభదాయకమంటే..

ఆర్బీఐ గణాంకాల ప్రకారం, డిజిటల్ ఆర్థిక మోసాల కేసుల సంఖ్య గత రెండేళ్లల్లో ఏకంగా 10 శాతం మేర పెరిగింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం, 2021లో బాధితులు ఏకంగా రూ.10,300 కోట్లు నష్టపోయారు. తాము మోసపోయామంటూ బాధితుల నుంచి సగటున రోజుకు 67 వేల కాల్స్ వస్తున్నట్టు కూడా సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో డిజిటల్ ఆర్థిక మోసాల బారిన పడిన వారు తక్షణం ఏం చేయాలో నిపుణులు చెబుతున్నారు.

Pan Card: మీ వద్ద రెండు పాన్ కార్డులు ఉన్నాయా? రిస్క్‌లో పడ్డారుగా!


ఫ్రాడ్ జరిగిందన్న అనుమానం రాగానే ముందుగా సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించాలి. ఆలస్యం చేసే కొద్దీ ఆర్థికనష్టం పెరిగిపోతుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు 24/7 ఫ్రాడ్ హెల్ప్‌లైన్స్ అందుబాటులోకి తెచ్చాయి. ఈ హెల్ప్‌లైన్స్‌లో సంప్రదించి అకౌంట్లను స్తంభింపచేస్తే నష్టాన్ని చాలా వరకూ తగ్గించుకోవచ్చు.

Life Insurance: జీవిత బీమా తీసుకుంటున్నారా? ఈ 6 విషయాల్లో జాగ్రత్త!

బ్యాంకును సంప్రదించిన తరువాత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. సైబర్ నేరాలకు సంబంధించి జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. వేగంగా ఎఫ్‌ఐఆర్ దాఖలైతే, నగదు రికవరీ అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Personal Finance: మిడిల్ క్లాస్ జీవులు కచ్చితంగా పాటించాల్సిన 10 ఆర్థిక సూత్రాలు!


బ్యాంకులు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు జాతీయ సంస్థలైన ఆర్బీఐ అంబుడ్స్‌మెన్‌ లాంటి సంస్థలకూ ఫిర్యాదు చేయాలి. నేరాలు జరిగిన సందర్భాల్లో అంబుడ్స్‌మన్.. బాధితులకు, వారి బ్యాంకులకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించి సమస్య సత్వరపరిష్కారానికి కృషి చేస్తుంది. పోయిన సొమ్ము దక్కించుకునే అవకాశాలు మెరుగవుతాయి.

వినియోగదారుల వ్యవహారాల శాఖ పరిధిలోని నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు కూడా ఫిర్యాదు చేయొచ్చు.

మోసానికి గురైనప్పుడు తక్షణం ఫిర్యాదు చేయడం ఎంత అవసరమో మోసాల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే అవసరం. కాబట్టి, డబ్బులు ఏ సంస్థకైతే చెల్లించబోతున్నారో ఆ సంస్థ విశ్వసనీయతను ఒకటికి రెండు సార్లు నిర్ధారణ చేసుకోవాలి. డబ్బు కోసం అవతలి వారు తొందర పెడుతుంటే అనుమానించాలి. ఓటీపీ, పిన్ నెంబర్‌ ను అడిగితే కచ్చితంగా అనుమానించాలి. ఇక డబ్బులు చెల్లించాల్సి వస్తే నమ్మదగిన వేదికల నుంచే ట్రాన్సాక్షన్ పూర్తి చేయాలి.

Personal Finance: ఇలా చేస్తే పదవీ విరమణ తరువాత నెలకు రూ.1.5 లక్షల పెన్షన్!

Read Latest and Business News

Updated Date - Sep 21 , 2024 | 08:54 PM