Share News

ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఆలస్యమైతే.. ఏమవుతుంది, ఫైన్ ఎంత?

ABN , Publish Date - Jul 27 , 2024 | 07:17 AM

ప్రతి పన్ను చెల్లింపుదారులు ఏటా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు(ITR filing) చేయాల్సి ఉంటుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(ITR) ఫైల్ చేసేందుకు చివరి తేదీ జులై 31, 2024గా ఉంది. అయితే గడువు తేదీ తర్వాత ITR ఎలా ఫైల్ చేయాలి, ఎంత ఫైన్ పడుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఆలస్యమైతే.. ఏమవుతుంది, ఫైన్ ఎంత?
ITR filing

ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఏటా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు(ITR filing) చేయాల్సి ఉంటుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(ITR) ఫైల్ చేసేందుకు చివరి తేదీ జులై 31, 2024గా ఉంది. ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారులందరూ గడువు తేదీలోగా రిటర్న్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ కొంత మంది దానిని ఫైల్ చేయడానికి గడువును కోల్పోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వారు జరిమానా ఎంత చెల్లించవలసి ఉంటుంది, గడువు తేదీ తర్వాత ITR ఎలా ఫైల్ చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


చెల్లించకుంటే ఎలా?

జులై 31లోగా రిటర్నులు దాఖలు చేయకపోతే రెండు రకాల జరిమానాలు(fines) విధిస్తారు. మొదట, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234A ప్రకారం, పన్ను చెల్లింపుదారు తన పన్ను మొత్తంపై ప్రతి నెలా 1 శాతం చొప్పున వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారు రిటర్న్ ఫైల్ చేసిన తేదీ నుంచి వడ్డీ లెక్కించబడుతుంది. రెండోది ఏమిటంటే జులై 31లోగా రిటర్న్‌లు దాఖలు చేయకపోతే, పన్ను చెల్లింపుదారులు వాపసు డబ్బును పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది కాకుండా పన్ను చెల్లింపుదారు సమయానికి పన్ను చెల్లించకపోతే, అతను గృహ రుణం లేదా మరేదైనా రుణం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే బ్యాంకులు లేదా NBFCలు దరఖాస్తుదారు నుంచి ITR వివరాలను అడుగుతాయి.


పెనాల్టీ ఎంత?

ఇక ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పన్ను చెల్లింపుదారుడు గడువు తేదీలోగా రిటర్న్‌ను(return) దాఖలు చేయలేకపోతే, అతను ఆలస్యంగా రిటర్న్‌ను ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని కింద పన్ను చెల్లింపుదారు ఈ డిసెంబర్ 31 లోగా రిటర్న్స్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే గడువు తేదీ 31 జులై తర్వాత ఆలస్యంగా రిటర్న్‌లను దాఖలు చేయడానికి మీ నుంచి ఆలస్య రుసుము వసూలు చేయబడుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక పెనాల్టీ అనేది మొత్తం పన్ను చెల్లింపుదారుల వార్షిక ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.

వడ్డీ

ఉదాహరణకు పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే, ఆలస్యమైన రిటర్న్ దాఖలుపై అతను రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అతను రూ. 5,000 జరిమానా చెల్లించాలి. దీంతోపాటు పన్ను చెల్లింపుదారుడు తన పన్ను మొత్తంపై కూడా వడ్డీని చెల్లించాలి. పన్ను భారం నుంచి తప్పించుకోవాలంటే గడువు తేదీలోగా రిటర్నులు దాఖలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.


ఇవి కూడా చదవండి:

Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే


Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే

Read More Business News and Latest Telugu News

Updated Date - Jul 27 , 2024 | 07:22 AM