Share News

Advance Tax: ముందస్తు పన్ను అంటే ఏంటి.. దీని ప్రయోజనాలు ఏంటి, ఎవరికి లాభం

ABN , Publish Date - Sep 06 , 2024 | 03:52 PM

ప్రతి ఏటా దేశంలో అనేక మంది ట్యాక్స్ చెల్లింపులు చేస్తారు. అయితే మీకు అడ్వాన్స్ ట్యాక్స్(advance tax) గురించి తెలుసా. దీని ద్వారా ఎవరికి లాభం, ఎవరు చెల్లింపులు చేసుకోవచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 Advance Tax: ముందస్తు పన్ను అంటే ఏంటి.. దీని ప్రయోజనాలు ఏంటి, ఎవరికి లాభం
advance tax

భారతదేశంలో అనేక మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ప్రతి ఏటా అనేక మంది ట్యాక్స్(tax) చెల్లింపులు చేస్తారు. వారు సంపాదించిన మొత్తంలో వారి పన్ను పరిధి మేరకు చెల్లింపులు చేస్తారు. అయితే మీరు సంవత్సరానికి ఒకేసారి పన్ను చెల్లించడం కాకుండా, ఎప్పుడైనా ముందస్తు పన్ను(advance tax) గురించి విన్నారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం రండి. భారతదేశంలో ముందస్తు పన్ను చెల్లింపు విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఈ క్రమంలోనే 2024లో అత్యధికంగా పన్ను చెల్లించిన సెలబ్రిటీగా షారుక్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో SRK ముందస్తు పన్నుగా రూ.92 కోట్లు చెల్లించారు. అయితే చాలా మంది సెలబ్రిటీలు, ప్రముఖులు సహా అనేక మంది అడ్వాన్స్ ట్యాక్స్ ఎందుకు చెల్లిస్తారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చుద్దాం.


ముందస్తు పన్ను అంటే ఏంటి?

అడ్వాన్స్ ట్యాక్స్ అనే పేరును బట్టి చూస్తే ఇది సమయానికి ముందే చెల్లించే(payments) పన్ను అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం గురించి కొంత ఆలోచన ఉన్న వ్యక్తి ఈ పన్నును చెల్లిస్తారు. అంటే సంభావ్య ఆదాయానికి అనుగుణంగా ముందస్తు పన్ను చెల్లించాలి. వ్యాపార స్థాయిలో అడ్వాన్స్ ట్యాక్స్ కూడా చెల్లించుకోవచ్చు. ఎవరైనా ఈ పన్ను నిబంధనలను పాటించకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ పన్నును సంవత్సరం చివరలో కాకుండా, సంవత్సరం మధ్యలో వాయిదాలలో చెల్లించాలి. రూ. 10,000 కంటే ఎక్కువ పన్ను బాధ్యత కలిగిన వారికి ఈ పన్ను వర్తిస్తుంది.


ముందు చెల్లిస్తే ఎంటి ప్రయోజనం

ముందస్తు పన్ను చెల్లించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చివరి క్షణంలో పన్నులు చెల్లించే భారం నుంచి విముక్తి పొందవచ్చు. ఇది కాకుండా ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించినప్పుడు, మీ దరఖాస్తు కొన్నిసార్లు విఫలమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ముందస్తు పన్ను చెల్లింపు వల్ల పన్ను చెల్లింపుదారులకే కాకుండా ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది. డిపాజిట్ చేసిన సొమ్ముపై ప్రభుత్వానికి ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఈ పన్నును చెల్లించేందుకు ఆదాయపు పన్ను శాఖ 4 తేదీలను ఖరారు చేసింది. మీరు ఈ పన్నును జూన్ 15, సెప్టెంబర్ 15, డిసెంబర్ 15, మార్చి 15 తేదీలలో ఎప్పుడైనా జమ చేయవచ్చు. ఈ పన్ను మీరు సంపాదించిన మొత్తంపై చెల్లించే పన్ను ఆధారపడి ఉంటుంది.


ముందస్తు పన్ను ఎవరు చెల్లించాలి?

జీతం పొందిన వ్యక్తులు, ఫ్రీలాన్సర్‌లు, వ్యాపారాలు నిర్వహించే వారు చెల్లించవచ్చు. ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం పన్ను బాధ్యత రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, మీరు ముందస్తు పన్ను చెల్లించుకోవచ్చు. వ్యాపారాన్ని నిర్వహించని 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ముందస్తు పన్ను చెల్లింపు నుంచి మినహాయించబడ్డారు. కాబట్టి వ్యాపార ఆదాయం కలిగిన సీనియర్ సిటిజన్లు (60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ) మాత్రమే ముందస్తు పన్ను చెల్లించాలి.


ఇవి కూడా చదవండి:

Time Magazine: టైమ్ మ్యాగజైన్ 100 AI జాబితా ప్రభావవంతమైన వ్యక్తుల్లో.. అశ్విని వైష్ణవ్, అనిల్ కపూర్ సహా


Fire Accident: స్కూల్ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది విద్యార్థులు సజీవ దహనం

BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కట్టడికి బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్లాన్.. టాటా సపోర్ట్‌తో ఇక..


Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..


Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 06 , 2024 | 03:53 PM