Alert: మీ పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఆదాయంలో 20% కట్..!
ABN , Publish Date - Jun 28 , 2024 | 12:30 PM
మీరు పాన్, ఆధార్‌లను(PAN, Aadhaar) ఇంకా లింక్ చేయలేదా. అయితే ఇప్పుడే చేసేయండి. ఇప్పటికే చివరి తేదీ పూర్తింది. కానీ ఇప్పటికైనా జరిమానాతో చెల్లించండి. లేదంటే మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
మీరు పాన్(pan card), ఆధార్‌లను(Aadhaar) ఇంకా లింక్ చేయలేదా. అయితే ఇప్పుడే చేసేయండి. ఇప్పటికే చివరి తేదీ పూర్తింది. కానీ ఇప్పటికైనా జరిమానాతో చెల్లించండి. లేదంటే మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే పాన్ ఆధార్ లింక్ చేయకుంటే పన్ను చెల్లింపుదారుల ఆదాయంపై 10 శాతానికి బదులుగా 20% ఎక్కువ TDS కట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతోపాటు ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ITR) ఫైలింగ్‌పై కూడా ప్రభావం చూపుతుంది.
రిటర్న్‌లు ఫైల్(it returns file) చేయడానికి చివరి తేదీ జూలై 31, 2024గా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఈ రిటర్నులు ఫైల్ చేసే లోపు పాన్ ఆధార్ అప్‌డేట్ చేసుకోండి. గతంలో మే 31లోగా తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు తెలిపింది. మీరు దీన్ని చేయకపోతే మరింత పన్ను చెల్లించవలసి ఉంటుందని అలర్ట్ కూడా చేసింది. ప్రస్తుతం ఇదే మీకు చివరి అవకాశం. అయితే పాన్ ఆధార్ లింక్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
పాన్‌ను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి?
మీరు ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/కి వెళ్లండి
వెబ్‌సైట్‌లో ఎడమవైపున ఉన్న 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి
తర్వాత మీరు మీ పాన్ నంబర్, ఆధార్ కార్డులో ఇచ్చిన నంబర్ వివరాలను ఎంటర్ చేయండి
దీని తర్వాత చివరగా 'లింక్ ఆధార్' బటన్‌పై క్లిక్ చేయండి
అప్పుడు మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌కి లింక్ చేయబడుతుంది
ఒక వేళ మీరు ఇప్పటికే లింక్ చేసి ఉంటే డిస్ ప్లేపై ఆ వివరాలను చూపిస్తుంది
మీరు SMS ద్వారా కూడా మీ పాన్‌ని ఆధార్(PAN, Aadhaar)తో లింక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 567678 లేదా 56161కి ఈ విధంగా మేసేజ్ చేయాలి. UIDPAN <స్పేస్> <12 అంకెల ఆధార్ నంబర్>> ఖాళీ <10 అంకెల పాన్ నంబర్> వివరాలను టైప్ చేసి SMS పంపాలి. ఈ విషయంలో మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు ఆదాయపు పన్ను శాఖ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.
ఇది కూడా చదవండి:
Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఇకపై మీ ప్లాన్ ధర..
Stock Markets: సెన్సెక్స్ 80,000కి చేరుకుంటుందా.. నిపుణులు ఏమన్నారంటే
Airport Roof Collapse: కుప్పకూలిన ఎయిర్‌పోర్ట్ పైకప్పు.. ఒకరు మృతి, 8 మందికి గాయాలు
For Latest News and Business News click here