Gold Seized: భారత్ బోర్డర్లో భారీగా గోల్డ్ పట్టివేత.. కోట్ల విలువైన పుత్తడి
ABN , Publish Date - May 26 , 2024 | 04:57 PM
లోక్‌సభ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున అక్రమ బంగారం(gold) వెలుగులోకి వచ్చింది. నిన్న ఆరో దశ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్(West Bengal)లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో భారీగా పుత్తడిని అధికారులు పట్టుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
లోక్‌సభ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున అక్రమ బంగారం(gold) వెలుగులోకి వచ్చింది. నిన్న ఆరో దశ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్(West Bengal)లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో భారీగా పుత్తడిని అధికారులు పట్టుకున్నారు. భారత్-బంగ్లాదేశ్(india-Bangladesh) సరిహద్దు వెంబడి సరిహద్దు భద్రతా దళం (BSF) హల్దర్‌పద గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో రూ.12 కోట్ల విలువైన గోల్డ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ క్రమంలో అనుమానిత స్మగ్లర్ అలోక్ పాల్ ఇంట్లో దాచిన వివిధ సైజుల్లోని 89 బంగారు బిస్కెట్లను(gold biscuits) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం 16.067 కిలోల బరువు ఉంటుందని అధికారులు తెలిపారు.
అక్రమ గోల్డ్ గురించి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు(officers) ఆపరేషన్ ప్రారంభించి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తి ఇంటిని చుట్టుముట్టారు. గ్రామ ప్రముఖుల సమక్షంలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి దాచిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని స్మగ్లర్ అలోక్ పాల్‌ను అరెస్ట్ చేశారు. అయితే మార్చి 2024లో బంగ్లాదేశ్‌కు చెందిన బంగారం స్మగ్లర్ తనను సంప్రదించినట్లు అలోక్ పాల్ విచారణలో అంగీకరించాడు.
స్మగ్లర్ తన ఇంట్లో బంగారాన్ని దాచుకునేందుకు రోజుకు రూ.400 ఇస్తానని చెప్పారని అలోక్ ఒప్పుకున్నాడు. బంగారం స్మగ్లింగ్ కేసులో తాను ఇప్పటికే ఒక నెల జైలు శిక్ష అనుభవించానని, ప్రస్తుతం తనపై బంగాన్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని అలోక్ పాల్ చెప్పారు. అరెస్టు చేసిన స్మగ్లర్లు, స్వాధీనం చేసుకున్న బంగారంను తదుపరి చట్టపరమైన చర్యల కోసం కోల్‌కతాలోని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI)కి అప్పగించారు.
ఇది కూడా చదవండి:
Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటున్నారా..ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
Read Latest Crime News and Telugu News