Share News

Hyderabad: క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతామంటూ మోసం...

ABN , Publish Date - May 22 , 2024 | 10:27 AM

క్రెడిట్‌కార్డు లిమిట్‌ పెంచుతామని ఫోన్‌ చేసి ఆన్‌లైన్‌(Online)లో మోసానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురానగర్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎల్లారెడ్డిగూడ మధుబన్‌ అపార్ట్‌మెంట్‌(Ellareddyguda Madhuban Apartment)లో నివాసం ఉండే ప్రీతి రాణా ప్రైవేట్‌ ఉద్యోగి.

Hyderabad: క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతామంటూ మోసం...

హైదరాబాద్: క్రెడిట్‌కార్డు లిమిట్‌ పెంచుతామని ఫోన్‌ చేసి ఆన్‌లైన్‌(Online)లో మోసానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురానగర్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎల్లారెడ్డిగూడ మధుబన్‌ అపార్ట్‌మెంట్‌(Ellareddyguda Madhuban Apartment)లో నివాసం ఉండే ప్రీతి రాణా ప్రైవేట్‌ ఉద్యోగి. ఆమెకు ఇండ్‌సఇండ్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ఉంది. ఈమెకు 9-1-2024లో ఓ ఫోన్‌ వచ్చింది. ఇండ్‌సఇండ్‌ బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని, మీ క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతామని చెప్పారు. ఆమె మొదట వారిని నమ్మలేదు. వారికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

ఇదికూడా చదవండి: Hyderabad: జైలుకు వెళ్లొచ్చినా చోరీలు మానలేదుగా...


అదే రోజు సాయంత్రం ఒక వ్యక్తి ఇండ్‌సఇండ్‌ బ్యాంకు ఉద్యోగినని వాట్సాప్(Whatsapp)‏లో తన ఐడీ కార్డు పెట్టాడు. దీంతో ఆమె నిజమనుకొని క్రెడిట్‌కార్డు లిమిట్‌ పెంచేందుకు కార్డు వివరాలు చెప్పింది. వెంటనే రూ.16,600, రూ.19,600 కార్డు నుంచి వాడినట్టు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ఆమె ఇది మోసమని గ్రహించి వెంటనే ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. కానీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఆలోచన రాక ఆలస్యం చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 22 , 2024 | 10:27 AM