Share News

Chanakya Niti: మీ పిల్లల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే ఈ 3 టిప్స్ పాటించాల్సిందే

ABN , Publish Date - Sep 28 , 2024 | 01:38 PM

Chanakyaniti: మీరు కూడా మీ పిల్లల జీవితం సాఫీగా సాగాలని అనుకుంటున్నారా.. మీ బిడ్డ జీవితంలో పురోగతి సాధించాలనుకుంటున్నారా? అయితే, చాణిక్యుడు చెప్పిన ముఖ్యమైన మూడు సూత్రాలు పాటించాల్సిందే. శతాబ్దాల తరబడి మానవాళి ఆచరణీయమైన ఈ సూత్రాలను పాటిస్తే.. పిల్లల భవిష్యత్ బంగారుమయం అవడం ఖాయం అని చెప్పొచ్చు.

Chanakya Niti: మీ పిల్లల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే ఈ 3 టిప్స్ పాటించాల్సిందే
Chanakyaniti Tips

Chanakya Niti Tips: పిల్లలు పెంచడం అనేది పెద్ద టాస్క్. వారు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చెబుతూ తల్లిదండ్రులు వారిని పెంచాల్సి ఉంటుంది. అలాగే పిల్లల భవిష్యత్‌‌పై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతుంటారు. వారి భవిష్యత్‌ ఎలా ఉండబోతుందో అనే ఆలోచన ప్రతిఒక్కరి తల్లిదండ్రుల్లో ఉంటుంది. మీరు కూడా మీ పిల్లల జీవితం సాఫీగా సాగాలని అనుకుంటున్నారా.. మీ బిడ్డ జీవితంలో పురోగతి సాధించాలనుకుంటున్నారా? అయితే, చాణిక్యుడు చెప్పిన ముఖ్యమైన మూడు సూత్రాలు పాటించాల్సిందే. శతాబ్దాల తరబడి మానవాళి ఆచరణీయమైన ఈ సూత్రాలను పాటిస్తే.. పిల్లల భవిష్యత్ బంగారుమయం అవడం ఖాయం అని చెప్పొచ్చు. మరి ఆచార్య చాణక్యుడు పిల్లల కోసం ఏం చెప్పాడో ఈ కథనంలో తెలుసుకుందాం..

YS Jagan: ఆత్మ రక్షణలో వైసీపీ.. అధ్యక్షుడి వ్యాఖ్యలతో అంతా అయోమయం..


వాస్తవానికి తల్లిదండ్రులు.. తమ పిల్లల గురించి ఆందోళన చెందుతూనే ఉంటారు. తమ బిడ్డ భవిష్యత్ ఎలా ఉంటుంది, పెరిగి పెద్దయ్యాక ఏమవుతారు అనే ఆలోచనలోనే ఉంటారు. అందుకే.. వారి చిన్నతనం నుంచి వారిపై ప్రత్యేక శ్రద్ధవహిస్తుంటారు. పిల్లలకు చిన్ననాటి నుంచి ఏర్పడిన అలవాట్లే శాశ్వతంగా ఉంటాయి. అవి మంచివైనా.. చెడువైనా.. అలాగే ఉండిపోతాయి. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకు మంచి, చెడు అలవాట్లు నేర్పించాలి. అయితే, పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పవలసిన మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. ఇది వారు జీవితంలో విజయం సాధించడమే కాకుండా దేశ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తుంది.


నిజాలు మాత్రమే మాట్లాడించండి..

ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా ఏ విషయంలో అయినా అబద్ధాలను చెప్పకూడదని చాణక్య నీతిలో ఆచార్యుడు పేర్కొన్నారు. సత్య మార్గాన్ని అనుసరించే వ్యక్తులకు చెడు ఏమీ జరగదని.. అలాంటి వారికి వారి జీవితంలో సమస్యలు చాలా తక్కువగా ఉంటాయన్నారు. ఒక్క అబద్ధాన్ని దాచాడం కోసం మరెన్నో అబద్దాలు చెప్పాల్సి ఉంటుంది. మీ పిల్లలు చిన్నతనం నుంచి సత్యమార్గాన్ని అనుసరిస్తే, వారు భవిష్యత్తులో సమర్థులు అవుతారు. అందుకే చాణక్యుడు ఎప్పుడూ నిజం మాట్లాడాలని సూచించారు.


క్రమశిక్షణ చాలా ముఖ్యం..

ప్రతిఒక్కరి జీవితంలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇంటా, బయటా ప్రతీ చోట క్రమశిక్షణ అనేది చాలా అవసరం. స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లో క్రమశిక్షణతో ఉండటం అనేది అతి ముఖ్యమైనది. అందుకే చిన్నతనం నుంచి మీ పిల్లలను క్రమశిక్షణతో పెంచడం అలావాటు చేయాలి. ఇలా చేస్తే వారి భవిష్యత్తులో క్రమశిక్షణ తప్పకుండా ముందుకు సాగుతుంటారు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఎంతో గౌరవంతో ఉన్నతంగా జీవిస్తారు. అలాగే అరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. క్రమశిక్షణ అనేది వ్యక్తికి సమయం విలువను తెలియజేస్తుంది. ఆచార్య చాణక్యుడు ప్రపంచంలో సమయం కంటే శక్తివంతమైనది ఏదీ లేదని చెప్పారు.

Bangalore: లోకాయుక్త ముందుకు కేంద్రమంత్రి..


విలువలతో కూడిన జీవితం..

ఒక వ్యక్తి మంచా, చెడా అని తెలుసుకోవాలంటే రూపాన్ని బట్టి కాదు.. గుణాన్ని బట్టి నిర్ణయిస్తారు. మీరు మీ పిల్లలకు చిన్నతనం నుండి మంచి విలువలు ఇస్తే, వారు మీ పేరును ఎప్పటికీ కించపరచరు. వారికి సమాజంలో గౌరవం లభించడమే కాకుండా తమ కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుండే మంచి విద్యను అందించి, వారి జీవితానికి సంబంధించిన నిజమైన ఆదర్శాలను పరిచయం చేసి, వారి ప్రవర్తనలో ప్రేమ, సామరస్యం, స్వచ్ఛత. సహజత్వాన్ని పెంపొందించేలా జాగ్రత్త వహించాలి. ఇది ఆ వ్యక్తికి మరింత సహాయం చేస్తుంది, అలాగే సమాజంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు.


ఇవి కూడా చదవండి...

Today Horoscope : ఈ రాశి వారు ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

Pawan Kalyan: ఆ అవసరం ప్రకాశ్ రాజ్‌కు లేదు.. పవన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

For More Spiritual News and Telugu News..

Updated Date - Sep 28 , 2024 | 01:38 PM