Share News

Lord Vinayaka: పెళ్లి కార్డులపై లంబోదరుడి ఫొటోనే ఎందుకు

ABN , Publish Date - Sep 06 , 2024 | 01:59 PM

గణేశుడికి మొదటి పూజతోనే ఏదైనా శుభ కార్యాలు ప్రారంభించాలని.. అప్పుడే అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే వివాహానికి సంబంధించి మొదటి శుభ లేఖను విఘ్నేశ్వరుడి చెంత ఉంచుతారు.

Lord Vinayaka: పెళ్లి కార్డులపై లంబోదరుడి ఫొటోనే ఎందుకు

ఇంటర్నెట్ డెస్క్: గణేశుడికి మొదటి పూజతోనే ఏదైనా శుభ కార్యాలు ప్రారంభించాలని.. అప్పుడే అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే వివాహానికి సంబంధించి మొదటి శుభ లేఖను విఘ్నేశ్వరుడి చెంత ఉంచుతారు. హిందూ ఆచారాల్లో వివాహం పవిత్రమైనది. ఈ బంధాన్ని చివరి వరకు కొనసాగించేందుకు పెళ్లిలో గణేశుడిని పూజించి ఆశీర్వాదం తీసుకుంటారు. హిందూ ఆచారాల ప్రకారం గణేశుడిని పూజించడం చాలా ముఖ్యం. అందుకే వ్యాపారాన్ని ప్రారంభించినా, ఇంటర్వ్యూకి వెళ్లిన, వివాహ సమయంలోనైనా ఆది దేవుడిలా భావించే విఘ్నేశ్వరుడిని పూజించాలనే నియమం ఉంటుంది.


గణేశుడిని వివేకం, జ్ఞానం ప్రసాదించే దేవుడిలా భావిస్తారు. అందుకే వివాహానికి సంబంధించిన అన్ని పనులను వివేకంతో చేస్తూ విజయం సాధించాలని గణపతిని పూజిస్తారు. లంబోదరుడు ఆదిపూజ్యుడు, విఘ్నలకధిపతి. వధూవరుల సంతోషకరమైన జీవితం కోసం ఆయన ఆశీర్వాదం పొందడానికి శుభలేఖపై వినాయకుడి ఫొటోను ముద్రిస్తూ భక్తిని చాటుకుంటారు. గణేశుడికి ఉన్న ఏనుగు తల ఒక వ్యక్తి తన ఆలోచన పరిధిని విస్త్రతపరుచుకోవాలని వివాహంలో ఎవరినీ అవమానించకూడదనే నిగూఢ విషయాలను తెలియజేస్తుంది.


చంద్రుని పరిహాసం

ఒకనాడు వినాయకుడు తల్లిదండ్రుల పాదాలకు వంగి నమస్కరించలేకపోతాడు. అది చూసిన చంద్రుడు నవ్వుతాడు. అప్పుడు పార్వతీ దేవి చంద్రుడిని చూసిన వారికి నీలాపనిందలు తప్పవని శపిస్తుంది. అయితే అది కేవలం చంద్రుడికి మాత్రమే కాదు లోకానికి శాపం తల్లీ అంటూ శాపవిముక్తి చెప్పమని చంద్రుడు వేడుకుంటాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు గణపతి పూజచేసి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకుంటే నిలాపనిందలు పోతాయని..అప్పుడు చంద్రుడిని చూసినా ఎలాంటి దోషం ఉండదని పార్వతీ దేవీ చెప్పడంతో భక్తులు అదే అనుసరిస్తున్నారు.

For Latest News click here

Updated Date - Sep 06 , 2024 | 01:59 PM