Share News

రక్షకతడులు ఇవ్వడానికి సిద్ధంకండి

ABN , Publish Date - Sep 04 , 2024 | 11:26 PM

మండలంలోని మల్లిరెడ్డిపల్లి, తవళం, గేమేనాయక్‌తండా, చీకటిమానుపల్లి పంచాయతీల్లో ఎంపిక చేసిన 19 గ్రామాల్లో సాగుచేసిన ప్రతి చేనుకు రక్షకతడులు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏపీఎఫ్‌ (అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన) ప్రతినిధి వాటర్‌ ఎక్స్‌ఫర్ట్‌ నిఖిల్‌ పేర్కొన్నారు.

రక్షకతడులు ఇవ్వడానికి సిద్ధంకండి
బీడు భూములో సాగుచేసిన వేరుశనగ పరిశీలిస్తున్న ప్రతినిధులు

తనకల్లు, సెప్టెంబరు 4 : మండలంలోని మల్లిరెడ్డిపల్లి, తవళం, గేమేనాయక్‌తండా, చీకటిమానుపల్లి పంచాయతీల్లో ఎంపిక చేసిన 19 గ్రామాల్లో సాగుచేసిన ప్రతి చేనుకు రక్షకతడులు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏపీఎఫ్‌ (అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన) ప్రతినిధి వాటర్‌ ఎక్స్‌ఫర్ట్‌ నిఖిల్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని గౌళ్లపల్లి వద్ద ఖరీఫ్‌లో వర్షాధారం కింద బీడు భూముల్లో రైతులు సాగుచేసిన సజ్జ, కొర్ర, వేరుశనగ తదితర పంటలను పరిశీలించిన ఆయన మాట్లాడారు.


పురుగుమందులు, రసాయన ఎరువులు లేని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ద్రవజీవామృతం యూని ట్లను పరిశీలించారు. ఆయన వెంట వాసన సంస్థకు చెందిన రీసోర్సు పర్సన చంద్రశేఖర్‌, జనజాగృతి అధ్యక్షులు బలరాం, ప్రాజెక్టు మేనేజర్‌ రాంప్రసాద్‌, న్యూచురల్‌ ఫామింగ్‌ ఎక్స్‌ఫర్టు సుప్రీయ, జనజాగృతి సిబ్బంది, గౌళ్లపల్లి, మల్లిరెడ్డి, నడిమికుంటపల్లి, పెద్దపల్లి గ్రామాల రైతులు తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 04 , 2024 | 11:26 PM