Share News

విధుల నుంచి తొలగించవద్దు...

ABN , Publish Date - Sep 03 , 2024 | 11:12 PM

వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన ఆర్ట్స్‌ యూనివర్సిటీలో పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమని.. ఉద్యోగాల్లో కంటిన్యూ చేయకపోతే మా కుటుంబాలు వీధిన పడతాయంటూ నాన టీచింగ్‌ స్టాఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

విధుల నుంచి తొలగించవద్దు...
నిరసన వ్యక్తం చేస్తున్న నాన టీచింగ్‌ స్టాఫ్‌

నాన టీచింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగుల వేడుకోలు

చెన్నూరు, సెప్టెంబరు 3: వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన ఆర్ట్స్‌ యూనివర్సిటీలో పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమని.. ఉద్యోగాల్లో కంటిన్యూ చేయకపోతే మా కుటుంబాలు వీధిన పడతాయంటూ నాన టీచింగ్‌ స్టాఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమను ఆ యూనివర్సిటీ వీసీ తొలగిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం యూనివర్సిటీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టాఫ్‌కు చెందిన షేక్‌ రబీవుల్లా మాట్లాడుతూ తమను ఈ ఏడాది మార్చిలో అవుట్‌సోర్సింగ్‌ కింద 47 మందిని తీసుకున్నారని, అయితే జూలై వరకు జీతాలు చెల్లించి ఆగస్టులో తొలగిస్తున్నామని చెప్పడం దారుణమన్నారు. తామంతా పేదలమని, మాలో కొందరు వికలాంగులు ఉన్నారన్నారు. పనిచేస్తేనే తమ జీవితాలు గడుస్తాయని.. ఏ కారణం చూపించకుండా తమను తొలగిస్తామని చెప్పడం అన్యాయమన్నారు. వైవీయూ, డాక్టర్‌ బీఆర్‌ యూనివర్శిటీ, పులివెందుల, కడప రిమ్స్‌ కళాశాలలో తమలాగే ఉద్యోగులు పనిచేస్తున్నా వారిని తొలగించలేదని.. కేవలం ఇక్కడ మాత్రమే తొలగించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇంటర్వ్యూద్వారా ఈ ఏడాది మార్చి 15న తీసుకున్న తమను ఇలా తీసేస్తామని చెప్పడం తగదని.. ఈ విషయంలో తాము ఉపముఖ్యమంత్రి పవనకల్యాణ్‌కు వినతిపత్రతాలు పంపుతామని తెలిపారు.

Updated Date - Sep 03 , 2024 | 11:12 PM